Begin typing your search above and press return to search.

వీర‌య్య నుంచి ఆ పాటొస్తే ఫ్యాన్స్ కు పూన‌కాలే!

By:  Tupaki Desk   |   27 Dec 2022 11:19 AM GMT
వీర‌య్య నుంచి ఆ పాటొస్తే ఫ్యాన్స్ కు పూన‌కాలే!
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ 'క్రాక్ ' త‌రువాత ఆ రేంజ్ హిట్ తో మ‌ళ్లీ మ్యాజిక్ చేయ‌లేక‌పోతున్నాడ‌ని ఫ్యాన్స్ ఇన్నాళ్లుగా ఫీల‌వుతూ వ‌స్తున్నారు. అయితే వారికి 'ధ‌మాకా'తో ర‌వితేజ ఒక్క‌సారిగా డ‌బుల్ ట్రీట్ ఇచ్చేశాడు. ర‌వితేజ న‌టించిన 'ధ‌మాకా' మూవీ ఈ శుక్ర‌వారం విడుద‌లై మంచి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో కు మిశ్ర‌మ స్పంద‌న‌ని సొంతం చేసుకున్న 'ధ‌మాకా' వ‌సూళ్ల ప‌రంగా తొలి రోజు ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ త‌రువాత రోజు రోజుకీ ఊహించ‌ని విధంగా పుంజుకుంటూ ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌య ప‌రుస్తోంది.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్ లోనూ 'ధ‌మాకా' వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ ఊహించ‌ని విధంగా బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. దీంతో మాస్ రాజా వ‌రుస ఫ్లాపుల త‌రువాత మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేశాడ‌ని అంటున్నారు. 'క్రాక్‌' మూవీ త‌రువాత ర‌వితేజ న‌టించిన 'ఖిలాడీ', 'రామారావు ఆన్ డ్యూటీ' మాస్ ప్రియుల్ని పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. భారీ డిజాస్ట‌ర్స్ అనిపించుకున్నాయి. అయితే ఈ మూవీస్ త‌రువాత ఊహించ‌ని విధంగా స‌క్సెస్ టాక్ ని సొంతం చేసుకుని వ‌సూళ్ల ప‌రంగా బాక్సాఫీస్ వ‌ద్ద 'ధ‌మాకా' సంద‌డి చేస్తోంది.

దీంతో ర‌వితేజ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. 'ధ‌మాకా' మూవీ సాధిస్తున్న స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రోజుల త‌రువాత ఫ్యాన్స్ కోరుకున్న మాస్ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్ తో ర‌వితేజ ఎంట‌ర్ టైన్ చేస్తుండ‌టంతో అభిమానుల్లో మునుపెన్న‌డూ లేని జోష్ మొద‌లైంది. అది 'వాల్తేరు వీర‌య్య‌'కు మ‌రింత ప్లాస్ గా మార‌బోతోంద‌ని తెలుస్తోంది. కార‌ణం ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తుండ‌టంతో ఇప్ప‌డు అంద‌రి క‌న్ను మెగాస్టార్ 'వాల్తేరు వీర‌య్య‌' పై ప‌డింద‌ని చెబుతున్నారు.

దాదాపు 22 ఏళ్ల విరామం త‌రువాత చిరుతో క‌లిసి మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తున్న సినిమా ఇది. గ‌తంతో పోలిస్తే మాస్ రాజాకు భారీ స్కోప్ వున్న పాత్ర ల‌భించ‌డ‌మే కాకుండా ప‌వ‌ర్ ఫుల్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్ కూడా వుండ‌టంతో ర‌వితేజ ఫ్యాన్స్ 'వాల్తేరు వీర‌య్య‌' కోసం ఎదురు చూస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి టీజ‌ర్‌, లిరిక‌ల్ వీడియోలు, ర‌వితేజ ఇంట్కో గ్లిమ్స్ బ‌య‌టికి వ‌చ్చి ర‌చ్చ చేశాయి. ఇదిలా వుంటే ఈ మూవీ కోసం చిరు, ర‌వితేజ‌ల‌పై ఓ సాంగ్ ని చిత్రీక‌రించార‌ట‌.

ఆ సాంగ్ ని రిలీజ్ చేస్తే మాస్ రాజా ఫ్యాన్స్ కు పూన‌కాలు గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది. ఈ పాట‌కు సంబంధించిన లిరిక‌ల్ వీడియోని త్వ‌ర‌లోనే మేక‌ర్స్ రిలీజ్ చేయ‌బోతున్నార‌ని.. అప్ప‌టి నుంచి పూన‌కాలు ఓ రేంజ్ కి చేర‌డం ఖాయ‌మ‌ని ఇన్ సైడ్ టాక్‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.