Begin typing your search above and press return to search.
మధుమేహంతో బెంబేలెత్తిన స్టార్ హీరో
By: Tupaki Desk | 11 Sep 2022 2:30 AM GMTలైఫ్ స్టైల్ ఈ రోజుల్లో చాలా కీలకం. మనిషి ఆరోగ్యాన్ని నిర్ణయించేంది జీవిత విధానం మాత్రమే. చక్కని ఆరోగ్య సూత్రాలను అనుసరించకపోతే ఏజ్ ముదిరాక ఫలితం అనుభవించాల్సిందేనని వైద్యులు చెబుతూనే ఉంటారు. కానీ దానిని ఆచరించేవాళ్లు చాలా అరుదు. అయితే టాలీవుడ్ లో 60 ప్లస్ ఏజ్ లోనూ ఎంతో క్రమశిక్షణతో తన లుక్ ని మెయింటెయిన్ చేసే సదరు సీనియర్ హీరో.. ఎక్కడ తేడా వచ్చిందో కానీ అనూహ్యంగా మధుమేహం (సుగర్) భారిన పడ్డారు.
అంతే .. ఇది ఒక్కసారిగా అతడిని టెన్షన్ లోకి దించేసిందట. నిజానికి మధుమేహం రానంతవరకే.. వచ్చిన తర్వాత దానిని పూర్తిగా తొలగించడం అన్నది వైద్యశాస్త్రంలో లేనేలేదు.
అందుకే ఇది అతడిని టెన్షన్ కి గురి చేస్తోందిట. ఇకపోతే ఏజ్ తో పాటే ఈ మార్పు. దీనిని అందరిలా డైజెస్ట్ చేసుకుంటేనే ముందుకు సాగేది. ప్రతిసారీ సుగర్ ఉంది! అనుకుంటే లాభం లేదు. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లలో ఉండాలి. ఈ స్టార్ హీరో క్రమశిక్షణకు మారు పేరు. బరువు పెరుగటం అనే సమస్యే లేదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉన్నాడు.
మధుమేహం వచ్చాక కొందరు అత్యుత్తమ వైద్యులు అతనికి వైద్య సలహాలిస్తున్నారు కానీ దీని నుంచి బయటపడడం ఎలానో చెప్పలేదట. ఇటీవలి కాలంలో ఆయన బరువు తగ్గారు. ఇది పాక్షికంగా మధుమేహం కారణంగా అనుసరిస్తున్న కఠినమైన జీవనశైలి కారణంగా అలా తగ్గారు.
ఇక అందం ఆకర్షణ ఏమాత్రం తగ్గకుండా మరింత జాగ్రత్తగా ఉంటేనే హీరోగా కొనసాగగలరని సన్నిహితులు సలహాలిస్తున్నారు. ఆ ఒక్కటీ మర్చిపోయి యథావిధిగా తన కార్యకలాపాలను కొనసాగిస్తే ఆరోగ్య సూత్రాలను పాటిస్తే మునుముందు జీవితం ఆహ్లాదంగా సాగుతుంది. లేదా ఇలా అయ్యిందేమిటీ? అని టెన్షన్ పెట్టుకుంటే ఆ ప్రభావం సినిమాలపైనా ఆరోగ్యంపైనా పడుతుందని వైద్యులు సెలవిచ్చారని సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.