Begin typing your search above and press return to search.
అమలా పాల్ కేసులో అదిరిపోయే ట్విస్ట్ ?
By: Tupaki Desk | 8 Sep 2022 2:45 PM GMTతెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది అమలా పాల్. దర్శకుడు ఎ.ఎల్. విజయ్ తో ప్రేమ , పెళ్లి వరకు వెళ్లిన అమలా పాల్ ఆ తరువాత అతనికి విడాకులిచ్చి విడిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన అమలా పాల్ మళ్లీ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. కానీ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.
తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ భవ్నీందర్ సింగ్ దత్ పై తమిళనాడులోని విల్లుపురం పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచింది. తనని బిజినెస్ లోనూ భవ్ నీందర్ సింగ్ దత్ చీట్ చేశాడని, అంతే కాకుండా తనకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలని, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో అమలాపాల్ కంప్లైంట్ ని సీరియస్ గా తీసుకున్న విల్లుపురం పోలీసులు భవ్ నీందర్ సింగ్ తో పాటు మరో 11 మందిపై సెక్షన్ 16 కింద కేసు నమోదు చేశారు. అంతే కాకుండా భవ్ నీందర్ సింగ్ ని అదుపులోకి తీసుకుని మిగతా 11 మంది కోసం గాలింపు చేపట్టారు. అయితే 2018లో అమలా పాల్ భవ్ నీందర్ సింగ్ తో కలిసి ఓ ప్రొడక్షన్ కంపనీని స్టార్ట్ చేసిందట. అదే సమయంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని, అది కాస్తా ప్రేమగా మారిందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నామంటూ ఈ ఇద్దరు ఓ ఫొటోషూట్ ని షేర్ చేయడం.. అందులో అమలా, భవ్ నీందర్ సింగ్ లిప్ లాక్ చేయడం తెలిసింది. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
ఇదిలా వుంటే తాజాగా అమలాపాల్, భవ్ నీందర్ సింగ్ ల కేసు కోర్టుకు చేరుకుందని తెలిసింది. అక్కడ అమలాపాల్ కు భవ్ నీందర్ సింగ్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. 2017ఇద్దరం పంజాబీ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నామని, దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను భవ్ నీందర్ సింగ్ కోర్టుకు సమర్పించాడట. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి అని విడిపోయామే కానీ లీగల్ గా తాము ఇప్పటికీ భార్యభర్తలమే నని షాకిచ్చాడట.
తనపై వున్న కోపం కారణంగానే లైంగిక వేధింపులకు గురిచేశానని ఆరోపణలు చేసిందని భవ్ నీందర్ సింగ్ జడ్జికి వివరించడంతో తనకు బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇది కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిందని, కొంత మంది అమలా పాల్ పై ఘాటుగా స్పందింస్తున్నారని తమిళ వర్గాల్లో వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.