Begin typing your search above and press return to search.
మహత్మా గాంధీ జీవితంపై వెబ్ సిరీస్!
By: Tupaki Desk | 30 July 2022 2:30 AM GMTస్వాతంత్ర్య సమరయోధుడు మహత్మాగాంధీ జీవితంపై ఇప్పటివరకూ పలు చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సహా దక్షిణాది పరిశ్రమలో పలు చిత్రాలు తెరకెక్కాయి. అయితే వాటిలో గాంధీ జీవితానికి సంబంధించి కొన్ని అంశాల్నే తీసుకుని తెరకెక్కకించారు. పూర్తి స్థాయిలో మహాత్ముడి జీవితంపై చిత్రాలు ఇప్పటివరకూ తెరకెక్కలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా గాంధీపై హిందీలో ఓ వెబ్ సిరీస్ కి రంగం సిద్దమవుతోంది. ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. గాంధీ పాత్రలో గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ నటిస్తున్నాడు. భారత స్వాతంత్ర్య పోరాట కాలం నాటి పరిస్థఙతుల్ని కళ్లకు కట్టడానికి హన్సల్ రెడీ అవుతున్నారు.
గాంధీ జీవితంపై ప్రచురింపబడిన పలు పుస్తకాల్ని..ఆ కాలం నాటి ఆధారాల్సి బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో గాంధీ కథని తెరకెక్కించడానికి సిద్దమవుతున్నారు. అయితే వీటిలో ప్రధానంగా ప్రముఖ రచయిత రామచంద్ర గుహ రాసిన `గాంధీ బిఫోర్ ఇండియా`..`గాంధీ ది ఇయర్స్ దట్ ఛేంజ్ ది వరల్డ్` రచనల్ని మెయిన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా హన్సల్ మెహతా మాట్లాడుతూ.. ``గాంధీ లాంటి గొప్ప వ్యక్తి జీవితం గురించి చెప్పాలంటే.. చాలా బాధ్యత ఉంటుంది. ఎన్నో విషయాలు తెలుసుకుని తీయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మా టీమ్ అదే పనిలో ఉంది. గాంధీ గురించి ఇంత వరకూ ఎవరూ చూపించని వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తామన్నారు.
మహత్ముడికి గొప్ప నివాళిగా ఈ సిరీస్ ని తీర్దిదిద్దుతామన్నారు. హన్సల్ మెహతా-ప్రతీక్ గాంధీ హింట్ కాబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రతీక్ నటించిన `స్కామ్ 1992 ` సిరీస్ కి హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ పెద్ద సక్సెస్ అయింది. భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ ఈ సిరీస్ కి మంచి ఆదరణ దక్కింది. ఈ నేపథ్యంలోనే మరోసారి సంచలన బయోపిక్ తో రావడానికి ఈ ద్వయం రెడీ అవుతోంది.