Begin typing your search above and press return to search.
ఇది నీకు తగునా అనసూయా
By: Tupaki Desk | 6 Feb 2018 9:27 AM GMTసెలెబ్రిటీలుగా ఎంత పాపులారిటీ వచ్చినా అది జనం ఇచ్చిందే అనే బేసిక్ మర్చిపోతే ఎవరికైనా మనుగడ ఉండదు. అది గుర్తించారు కాబట్టి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా 60 ఏళ్ళు దాటిన సీనియర్ హీరోలు ఇంకా తమ అభిమానుల చేత కీర్తింపబడుతూనే ఉన్నారు. అది కేవలం వాళ్ళు చేసిన సినిమాల వల్ల సాధించుకున్నది కాదు. తమ వ్యక్తిత్వం ద్వారా కూడా ఆ అభిమానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అందులో తేడా వస్తే పరిణామాలు వేరుగా ఉంటాయి. తాజాగా యాంకర్ అనసూయ ఒక చిన్న కుర్రాడి పట్ల వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలోనే కాక బయట కూడా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇటీవలే అనసూయ తార్నాక వైపు వెళ్తూ ఏదో కారణం వల్ల రోడ్డు సైడు ఆగింది. అదే దారిలో వెళ్తున్న ఒక చిన్న కుర్రాడు అనసూయను చూసిన ఉత్సాహంలో తల్లి దగ్గరున్న సెల్ ఫోన్ తీసుకుని సెల్ఫీ కోసం తన దగ్గరకు వెళ్ళాడు.
ఏదో ఒకటి సర్దిచెప్పడమో లేక కుదరదు అని సున్నితంగా చెప్పటమో చేస్తే సరిపోయేది. కాని అనసూయ ఆ ఫోన్ చేతిలోకి తీసుకుని అమాంతం దాని నేల మీదకు విసిరేసి కొట్టడంతో స్క్రీన్ కాస్త పగిలిపోయింది. దీంతో షాక్ తిన్న ఆ తల్లి చిన్న పిల్లాడు అడిగినప్పుడు ఇష్టం లేదంటే అదే చెప్పాలి కాని ఇలా విలువైన వస్తువును విసిరి కొట్టే హక్కు ఎవరిచ్చారంటూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఆ తల్లి చెప్పిన మాటలు - వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇది చూసిన నెటిజెన్లు అనసూయ ప్రవర్తనపై మండిపడుతున్నారు. బిజీ షెడ్యూల్ లో చిరాకులు ఉంటాయని అంత మాత్రాన అభిమానంతో దగ్గరికి వచ్చిన వాళ్ళ మీద ఇలా ప్రతాపం చూపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విషయాలు ఇలాగే వదిలెయకూడదని - అనసూయతో దీని గురించి వివరణ చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అనసూయ వెర్షన్ లైవ్ గా ఇంకా రాలేదు కాని తను చేసింది మాత్రం ముమ్మాటికి తప్పే. పిల్లలు కాబట్టి తెలిసి తెలియనితనంతో దగ్గరికి రావడం సహజం. అంత మాత్రాన ఇలా చేయటం సరికాదు. టాలెంట్ ఎంత ఉన్నా ఆదరించే ప్రేక్షక దేవుళ్ళు ఉన్నప్పుడే యాంకర్ కైనా - సినిమా స్టార్ కైనా డబ్బు - భవిష్యత్తు. అది పోగొట్టుకున్న రోజు సంపాదించుకోవడం అంత ఈజీ కాదు
దీనికి అనసూయ కూడా తన ట్విట్టర్ లో మెసేజ్ ద్వారా స్పందించింది. పోలీసుల సత్వర స్పందన బాగుందని - తనను ట్యాగ్ చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది. ఫోన్ విరిగిపోవడం పట్ల తనకు విచారంగానే ఉందన్న అనసూయ తమ ప్రైవసీని గౌరవించాలని కోరింది. జరిగింది ఏమిటి అనేది పూర్తిగా అందులో వెల్లడించపోయినా ఇదేమి దేశం మొత్తం చర్చించాల్సిన విషయం కాదని చెబుతూ తనను అభిమానించే వాళ్ళకు నిజాలు తెలియాలనే మెసేజ్ పెడుతున్నట్టు చెప్పింది. ఈ కథ ఇంకెన్ని మలుపులు తిరగనుందో.