Begin typing your search above and press return to search.
'సీతారామం' పై టాలీవుడ్ ప్రశంసల వర్షం!
By: Tupaki Desk | 6 Aug 2022 6:23 PM GMTదుల్కర్ సల్మాన్ నటించిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ `సీతారామం`. హను రాఘవపూడి తెరకెక్కించారు. `యుద్ధంతో రాసిన ప్రేమకథ` అని ట్యాగ్ లైన్. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరిచయం కాగా కీలక పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోతో మంఇ టాక్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ అనిపించుకుంది.
పాజిటివ్ రివ్యూస్ రావడమే కాకుండా సినిమా ఓ క్లాసిక్ అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. రిలీజ్ రోజు కలెక్షన్స్ కొంత తగ్గినట్టుగా అనిపించినా రెండవ రోజు సినిమా క్లాసిక్ అనే మౌత్ టాక్ స్ప్రెడ్ కావడంతో శనివారం ఉదయం నుంచి కలెక్షన్స్ భారీగా పెరిగినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ, ఏపీలోని చాలా ఏరియాల్లో సినిమా హైస్ ఫుల్స్ తో ప్రదర్శింపబడుతోంది దీంతో కలెక్షన్స్ కూడా భారీగా పెరిగినట్టుగా తెలుస్తోంది. వీకెండ్ కావడం, టాక్ కూడా పాజిటివ్ గా వుండటంతో భారీ స్థాయిలో వసూళ్లు పెరగడం ఖాయంగా కనిపిపస్తోంది.
ఇక ఓవర్సీస్ లోనూ ఇక్కడా తాజాగా రెండవ రోజు స్క్రీన్స్ పెంచేశారట. ఇదిలా వుంటే రొమాంటిక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా, ఓ క్లాసిక్ గా ప్రశంసలు సొంతం చేసుకుంటున్న ఈ మూవీపై టాలీవుడ్ స్టార్స్ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రేక్షకులు సినిమా థిమయేటర్లకు రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటనీ, మరింత ప్రోత్సాహాన్నిస్తూ కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలైన రెండు సినిమాలు విజయం సాధించడం ఎంతో సంతోషకం. ఈ సందర్భంగా `సీతారామం`, బింబిసార చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు నా మనఃపూర్వక శుభాకాంక్షలు `అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
ఇక మాస్ మహారాజా రవితేజ `సీతారామం` చూశాను. అసమానమైన కళను ప్రదర్శించినందుకు దల్కర్, మృణాల్, హను రాఘవపూడి, విశాల్ చంద్రశేఖర్, అశ్వనీదత్, వైజయంతీ మూవీస్ టీమ్ అందరికి అభినందనలు..ఈ క్లాసిక్ ని థియేటర్లలో ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ కాకండి` అని ట్వీట్ చేశారు. ఇదొక క్లాసిక్, పీరియడ్..దయచేసి ఈ మూవీని మిస్ కాకండి` అంటూ నేచురల్ స్టార్ నాని ప్రశంసించారు.
`సీతారామం` స్వచ్ఛమైన కవిత్వం. పెద్ద స్కీన్ పై అనుభూతిని పొందడం అద్భుతంగా వుంది. హను రాఘవపూడి, దుల్కర్‌చ మృణాల్, రష్మిక, తరుణ్ భాస్కర్ మరియు టీమ్ అందరికి అభినందనలు. ప్రియమైన స్వప్న దత్ మీ కన్విక్షన్ వల్లే ఇది సాధ్యమైంది` అని ఉస్తాద్ రామ్ ప్రశంసలు కురిపించారు.
ఈ మూవీకి దర్శకుడు హను రాఘవపూడి, రాక్ కుమార్ కొండముడి మాటలు అందించారు. వీరితో పాటు జై కృష్ణ కూడా డైలాగ్స్ అందించాడు. తను `సీతారామం`కు అందించిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి అని హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. సీతారామంలో నీ డైలాగ్ ల గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు. మీ విజయానికి చాలా సంతోషింగా వుంది. మీ సహ రచయితలను కూడా అభినందిస్తున్నాను` అని ట్వీట్ చేశారు.