Begin typing your search above and press return to search.

ఊర్వ‌శిపై బిగ్ పంచ్ వేసిన యంగ్ క్రికెట‌ర్

By:  Tupaki Desk   |   11 Aug 2022 2:30 PM GMT
ఊర్వ‌శిపై బిగ్ పంచ్ వేసిన యంగ్ క్రికెట‌ర్
X
క్రికెట‌ర్ల‌తో అందాల క‌థానాయిక‌ల ఎఫైర్ క‌హానీలు అన్నీ ఇన్నీ కావు. క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో క‌లిసి న‌టించ‌డంతో మొద‌ల‌య్యే ప‌రిచ‌యం కాస్తా చివ‌రికి ప్రేమాయ‌ణాల వ‌ర‌కూ వెళుతుంది. ఆ త‌ర్వాత పెళ్లి అయినా అవ్వొచ్చు.. లేదా బ్రేకప్ కి అయినా రెడీ అవుతుంటారు. దేనికైనా `సై` అనేస్తూ క్రికెట‌ర్ల‌తో చెలిమి కోసం త‌పించే క‌థానాయిక‌ల‌కు కొదవేమీ లేదు. ఫ‌లానా ట్యాలెంటెడ్ క్రికెట‌ర్ కి ఫ‌లానా హీరోయిన్ ల‌వ‌ర్ అన్న ట్యాగ్ కోసం ఈ త‌ప‌నంతా.

కొన్నిసార్లు క్రికెట‌ర్ - హీరోయిన్ జంట‌ను చూడ‌గానే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో ఉంది అంటూ కూడా ప్ర‌చార‌మైపోతుంది. చాలా కాలంగా అలాంటి ప్ర‌చార‌మే ఉంది క్రికెటర్ రిషబ్ పంత్ - ఊర్వశి రౌతేలా జంటపై. ఆ ఇద్ద‌రూ జంట‌గా ఉన్నారా లేరా? అన్న‌ది అటుంచితే.. రెండేళ్ల క్రితం ఇద్దరూ కలిసి బహిరంగ ప్రదేశాల్లో జంట‌గా కనిపించేవారు. వారిది గొప్ప స్నేహం అంటూ ప్ర‌చార‌మైపోయింది.

అయితే కాల‌క్ర‌మేణా స‌న్నివేశం వేరుగా మారింది. పంత్ 2020లో ఊర్వశిని సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడు. మ‌ళ్లీ కొంత గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు కూడా మ‌రోసారి పతాక శీర్షికల్లోకి ఎక్కారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి రౌతేలా తనను కలవడానికి గంటల తరబడి హోటల్ లాబీలో తన కోసం వేచి ఉన్న వ్యక్తి గురించి మాట్లాడింది. ఆ వ్యక్తిని `మిస్టర్ ఆర్పీ` అని కూడా పేర్కొంది. అప్పటి నుండి అందరూ RP అంటే రిషబ్ పంత్ అని ఊహిస్తున్నారు.

చివరికి రిషబ్ పంత్ కి కూడా ఇది చేరుకుంది. తాజాగా అత‌డు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ టైమ్ లైన్ లో క్రిప్టిక్ పోస్ట్ ను పంచుకున్నాడు. ``కొంత పాపులారిటీ కోసం .. హెడ్ లైన్స్ లోకి రావడం కోసం కొంద‌రు ఇంటర్వ్యూలలో ఎలా అబద్ధాలు చెబుతారో... కొంద‌రికి కీర్తి కోసం చాలా దాహం వేయడం విచారకరం.

దేవుడు వారిని దీవించును గాక`` అని అన్నాడు. నన్ను ఒంటరిగా వదిలేయండి సోదరి.. అబద్ధం చెప్పడానికి ఒక పరిమితి ఉంది!! అని కూడా అత‌డు పంచ్ వేసాడు. అయితే పంత్ నిమిషాల వ్యవధిలోనే ఆ కథనాన్ని తొలగించాడు. కానీ నెటిజనులు ఆ పోస్ట్ తాలూకా స్క్రీన్ షాట్ లను సోషల్ మీడియాలో ప‌బ్లిసిటీ చేస్తున్నారు. మరి పంత్ వ్యాఖ్యలపై ఊర్వశి ప్ర‌తిస్పందిస్తుందో లేదో చూడాలి. ఇంత‌కీ రిషబ్ తో ఊర్వ‌శికి చెడ‌టానికి కార‌ణ‌మేమిట‌న్న‌ది తెలియ‌రాలేదు.