Begin typing your search above and press return to search.
తెలుగు పరిశ్రమలో తొలి హాకీ మూవీ
By: Tupaki Desk | 27 Oct 2019 9:33 AM GMTపదిహేను సార్లు ఓడిపోయి పదహారో సారి గెలిచాడు మహమ్మద్ గజినీ. ప్రస్తుతం సందీప్ ప్రయత్నం అలానే ఉంది. ఇటీవలే `నిను వీడని నీడను నేను` ఆదుకోకపోతే గజినీని మించిపోయేవాడే. కానీ ఆ సినిమాతో ఫర్వాలేదనిపించే ఫలితం అందుకున్నాడు. ఈ ఉత్సాహంలోనే అతడు వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. తెనాలి రామ ఇప్పటికే సెట్స్ పై ఉంది. ఇది తెలుగు - తమిళంలో రిలీజవుతుంది.
తాజాగా ఏ1 ఎక్స్ ప్రెస్ అంటూ లుక్ రిలీజ్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. క్రీడానేపథ్యం ఉన్న చిత్రమిది. సందీప్ ఓ హాకీ స్టిక్ పట్టుకుని వెనక ఫీటుగా కనిపించాడు. ఆటలో గెలుపు నాదే! అన్నంత ధీమా ఆ లుక్ లో కనిపిస్తోంది. ``తెలుగు సినీపరిశ్రమలో తొలి హాకీ మూవీ ఇది. నీ బర్త్ డే గిఫ్ట్ ఇదే డాడ్`` అంటూ తన తండ్రికి ఈ సినిమాని అంకితమిస్తున్నాడు సందీప్. డెన్నిస్ జీవన్ కనుకలాను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. హిప్ హాప్ తమిజ సంగీతం అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా టీజీ విశ్వ ప్రసాద్- అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబోట్ల సహ నిర్మాత.
ఏ వన్ ప్లేయర్ గా సందీప్ ఏమేరకు రాణిస్తాడు? అన్నది చూడాలి. ఇక ఈ సినిమా బయోపిక్ కేటగిరీనా కాదా? అన్నది చెప్పాల్సి ఉంది. క్రీడా బయోపిక్ ల ట్రెండ్ లో సందీప్ ఆశించిన హిట్టు దక్కుతుందా లేదా? అన్నది చూడాలి. ఇప్పుడున్న మూడు సినిమాలు వేటికవే యూనిక్ కంటెంట్ తో వస్తున్నవే. మరి సక్సెస్ ఇచ్చేది ఏది? అన్నది చూడాలి.