Begin typing your search above and press return to search.
ఈ ఎక్స్ ప్రెస్ ఓటీటీలో అయినా పరుగులు పెట్టేనా?
By: Tupaki Desk | 1 May 2021 4:19 AM GMTయంగ్ హీరో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా రూపొంది మార్చి లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎ1 ఎక్స్ ప్రెస్ ను ప్రేక్షకులు ఆధరించలేదు. సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. కాని కరోనా కారణంగా జనాలు ఎక్స్ ప్రెస్ ఎక్కి ఎంటర్ టైన్‌మెంట్ అయ్యేందుకు ఆసక్తి చూపించలేదు. కరోనా కారణంగా ఢీలా పడ్డ సందీప్ ఎక్స్ ప్రెస్ ను ఓటీటీ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈసారి అయినా ఈ ఎక్స్ ప్రెస్ ను జనాలు ఆధరించి చూసేందుకు ఆసక్తి చూపిస్తారా అనేది చూడాలి.
తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ప్రాచుర్యం లేని సన్ నెక్ట్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వడం వల్ల జనాలు కాస్త వెనుక ముందు ఆడుతున్నారు. తెలుగులో ఎక్కువ మంది ఖాతాదారులు ఉన్న ఇతర ఓటీటీ ల్లో ఈ సినిమా విడుదల అయితే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సన్ నెక్ట్స్ ఖాతా ఉంటే చూస్తారు. కాని కొత్తగా ఈ సినిమా కోసం డబ్బులు చెల్లించి ఖాతా తీసుకుంటారా అంటే అనుమానమే అంటున్నారు.
జీవన్ కానుకొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సన్నిహితులతో కలిసి సందీప్ కిషన్ స్వయంగా నిర్మించాడు. హాకీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా థియేటర్ లో నిరాశ పర్చినా ఓటీటీ లో ఊరట కలిగిస్తుందని మేకర్స్ ఆశ పడుతున్నారు. మరి ప్రేక్షకులు ఈ సినిమా ను ఓటీటీ లో చూసేందుకు మొగ్గు చూపుతారా అనేది చూడాలి. ఇప్పటికే ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలు అయ్యింది. సోషల్ మీడియాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి పబ్లిసిటీ భారీగానే చేస్తున్నారు.