Begin typing your search above and press return to search.
బాహుబలి.. కేజీఎఫ్ ఇప్పుడు పుష్ప పార్ట్ 1
By: Tupaki Desk | 21 Nov 2021 5:14 AM GMTఅల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందిన పుష్ప సినిమాను మొదటి నుండి పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నట్లుగా చెబుతూ వచ్చారు. ఫస్ట్ లుక్ నే హిందీ వర్షన్ లో కూడా విడుదల చేయడం జరిగింది. పాటలు అన్ని కూడా హిందీలో వచ్చాయి.
అయితే కొన్ని కారణాల వల్ల హిందీలో పుష్ప ను విడుదల చేయబోవడం లేదు అంటూ ప్రచారం మొదలైంది. హిందీలో సినిమా విడుదల చేయాల్సిందే అంటూ అల్లు అర్జున్ అభిమానులు ముఖ్యంగా ఉత్తరాది అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. పుష్ప హిందీ వర్షన్ ఉండదేమో అనుకుంటున్న సమయంలో ఎట్టకేలకు అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి అని తెలుస్తోంది. సినిమా హిందీ వర్షన్ స్క్రీనింగ్ కు ఇబ్బంది లేదని తేలిపోయింది.
పుష్ప సినిమా ను హిందీలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏఏ ఫిల్మ్స్ వారు ముందుకు వచ్చారు. వారికి బాలీవుడ్ లో డిస్ట్రీబ్యూషన్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. అంతే కాకుండా సౌత్ సినిమాలను అక్కడ డబ్ చేసి విడుదల చేయడం జరిగింది.
బాహుబలి 2 హిందీ వర్షన్ ను ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేయడం జరిగింది. ఆ సినిమా ఫలితం గురించి ఇక చెప్పనక్కర్లేదు. బాహుబలి 2 మాత్రమే కాకుండా కేజీఎఫ్ ను కూడా ఉత్తరాదిన భారీగా విడుదల చేసింది ఈ సంస్థనే. ఈ సంస్థ ఎన్నో సినిమాలను విడుదల చేయగా అందులో చాలా సినిమాలు భారీ వసూళ్లను నమోదు చేశాయి. అత్యధిక థియేటర్ చైన్ వ్యవస్థ ఉన్న ఈ సంస్థ పుష్ప ను విడుదల చేసేందుకు సిద్దం అవ్వడంతో అభిమానులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు.
బాహుబలి మరియు కేజీఎఫ్ సెంటిమెంట్ పుష్ప కు వర్కౌట్ అయితే వసూళ్ల పరంగా రికార్డులు నమోదు అవ్వడం ఖాయం అంటున్నారు. కేజీఎఫ్ 2 ను విడుదల చేయడానికి ముందు ఈ సంస్థ పుష్ప ను విడుదల చేయబోతుండటం విశేషం. ఇప్పటికే పుష్ప సినిమా కోసం ఈ సంస్థ భారీ ఎత్తున థియేటర్లను లాక్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.
ఉత్తర భారతంలో భారీ ఎత్తున థియేటర్లను కలిగి ఉన్న ఈ సంస్థ పుష్ప తో అక్కడ అల్లు అర్జున్ ను స్టార్ గా నిలపడం ఖాయం అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏఏ ఫిల్మ్స్ సంస్థ రవీనా టాండన్ భర్త అయిన అనిల్ తడానీది. ఆయన ప్రతి సినిమాను కూడా భారీగా విడుదల చేయడం మాత్రమే కాకుండా ప్రమోషన్స ను కూడా చాలా అగ్రెసివ్ గా చేస్తారు. అందుకే ఆయనకు ఎన్నో సినిమాలు మంచి ఫలితాలను అందించాయి.