Begin typing your search above and press return to search.

#AA ది గ్రేట్: ఇంతింతై పాన్ ఇండియా స్టార‌య్యాడు!

By:  Tupaki Desk   |   8 April 2022 3:28 AM GMT
#AA ది గ్రేట్: ఇంతింతై పాన్ ఇండియా స్టార‌య్యాడు!
X
బ‌న్ని ది గ్రేట్.. అంటూ ప్ర‌శంసిస్తే అతిశ‌యోక్తి కాదు. ఇంతింతై వ‌టుడింతై! అన్న చందంగా అత‌డు ఎదిగిన తీరు నేటిత‌రం తార‌ల‌కు ఎంతో స్ఫూర్తి అన‌డంలో సందేహం లేదు. ఒక న‌టుడు బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకున్నా ఇత‌ర క్వాలిటీస్ తో గుర్తింపు తెచ్చుకోవ‌డం ఎలానో చేసి చూపించాడు అల్లు అర్జున్. స్వ‌యంకృషితో యూనిక్ నెస్ తో.. స్టైల్ కంటెంట్ తో ఎలా ఎద‌గాలో చూపించిన అల్లు స్టార్ మెగా కాంపౌండ్ లోనే స్పెష‌ల్ హీరోగా గుర్తింపు పొందాడు. అత‌డు ఇంతింతై ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

ప్ర‌భాస్ - రామ్ చ‌ర‌ణ్ త‌ర‌హాలోనే అల్లు అర్జున్ అనే పాన్ ఇండియా స్టార్ తెలుగులో ఉన్నాడు! అన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఇదేమీ ఆషామాషీ కాదు. అంత సులువేమీ కాదు. ఒక హీరోలో ఎన్నో గొప్ప క్వాలిటీస్ హార్డ్ వ‌ర్క్ త‌ప‌న ఉంటే కానీ ఇది సాధ్యం కానిది. ప్ర‌తిసారీ యూనిక్ నెస్ కోసం ప్ర‌య‌త్నిండం.. ల్యాండ్ మార్క్ డ్యాన్సుల‌తో అల‌రించ‌డం అన్న‌ది అంద‌రికీ సాధ్యంకానిది. బ‌న్నీకి జాతీయ స్థాయి గుర్తింపు ఏనాడో వ‌చ్చింది. అత‌డి డ్యాన్సుల‌ను అభిమానించే అగ్ర హీరోలు ఎంద‌రో ఉన్నారు.

అల్లు అర్జున్ కి నేటితో మ‌రో సంవత్సరం నిండింది. ఈ సంద‌ర్భంగా అభిమానులు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ఒక‌సారి కెరీర్ మ్యాట‌ర్ ని ప‌రిశీలిస్తే.. 2003లో గంగోత్రితో బ‌న్ని తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 18 సంవత్సరాల తన కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్ లను అందించాడు. అతను ఇటీవల మాస్ యాక్షన్ డ్రామా పుష్ప తో సంచ‌ల‌నం సృష్టించాడు. త‌న‌ని తాను పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్క‌రించుకున్నాడు.

బ‌న్నీ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రంగా పుష్ప నిలిచింది. అయితే అత‌డి కెరీర్ ఆద్యంతం ప‌రిశీలించి టాప్ 5 హిట్ చిత్రాల‌ను వెతికితే.. పుష్ప: ది రైజ్ ది బెస్ట్ గా నిలుస్తుంది. ఈ చిత్రానికి సుకుమార్ రచన - దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సౌత్ రీజియన్స్ లోనే కాకుండా హిందీ బెల్ట్ లోనూ రికార్డ్ లు బద్దలు కొట్టే కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. అద్భుతమైన థియేట్రికల్ రన్ తర్వాత స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లో మ‌రింత‌గా ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది.

ఇక ఏ న‌టుడికి అయినా త‌న తొలి సినిమా ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. 'గంగోత్రి' అల్లు అర్జున్ న‌టించిన తొలి సినిమా. ద‌ర్శ‌కేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ - అశ్వినీదత్ కలిసి నిర్మించారు. ఈ చిత్రం బ‌న్నీకి టాలీవుడ్ లో మంచి ప్రారంభాన్ని అందించింది. ఈ సినిమాలో అదితి అగర్వాల్ టైటిల్ రోల్ పోషించింది.

ఆ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో దేశముదురు (2007) చిత్రంతో మరో బంప‌ర్ హిట్ అందుకున‌నాడు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. అల్లు అర్జున్ ఇందులో క్రైమ్ రిపోర్టర్ గా న‌టించారు. అతను ఒక అసైన్ మెంట్ కోసం కులు మనాలికి వెళ్లి సన్యాసినిని ప్రేమించాక ఏం జ‌రిగింది? అన్న‌దే సినిమా కాన్సెప్ట్. ఈ చిత్రంలో హన్సిక మోత్వాని- ప్రదీప్ రావత్- అలీ కీలక పాత్రలు పోషించారు.

జులాయి... బ‌న్ని కెరీర్ టాప్ హిట్ల‌లో ఒక‌టి. అల్లు అర్జున్ సరసన ఇలియానా క‌థానాయిక‌గా న‌టించింది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ యాక్షన్-కామెడీ యూనిక్ కామిక్ టైమింగ్ ..అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో అల‌రించింది. కోట శ్రీనివాసరావు- సోనూసూద్- రాజేంద్ర ప్రసాద్ - బ్రహ్మానందం త‌దిత‌రులు న‌టించారు. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సరైనోడు లాంటి మాస్ హిట్ ని బ‌న్నీ అందుకున్నాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ -కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. అల్లు అర్జున్ తన వినోదభరితమైన యాక్షన్ సన్నివేశాలతో షోని అద‌ర‌గొట్టాడు. ఆది పినిశెట్టి విలన్ గా అద్భుతంగా నటించాడు.

అలా వైకుంఠపురములో చిత్రం బ‌న్నీ కెరీర్ బెస్ట్ హిట్స్ లో ఒక‌టి. ఈ సినిమా అర్జున్ 18 ఏళ్ల కెరీర్ లో టాలీవుడ్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూలు చేసింది. 2020లో విడుదలైన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను గొప్ప‌గా అల‌రించింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన పుష్ప‌- ది రైజ్ హిందీలోనూ స‌క్సెస్ సాధించి క‌రోనా క్రైసిస్ లోనూ స‌త్తా చాటింది.

పుష్ప చిత్రానికి కొన‌సాగింపు భాగం పుష్ప‌- ది రూల్ తెర‌కెక్క‌నుంది. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ సాగుతోంది. ఈ సంద‌ర్భంగా మైత్రి మూవీ మేక‌ర్స్ అండ్ పుష్ప టీమ్ అల్లు అర్జున్ కి బ‌ర్త్ డే విషెస్ చెబుతూ కొత్త‌ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది. '' RULE చేయ‌డానికి పుష్ప రెడీ అవుతున్నాడు. హ్యాపీ బ‌ర్త్ డే ఐక‌న్ స్టార్ అల్లు అర్జున్'' అంటూ సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు తెలిపింది.