Begin typing your search above and press return to search.

ఫస్ట్‌ లుక్‌: అఆ..లలో అనుబంధం సూపర్‌

By:  Tupaki Desk   |   1 Jan 2016 2:43 AM IST
ఫస్ట్‌ లుక్‌: అఆ..లలో అనుబంధం సూపర్‌
X
న్యూ ఇయర్ పండుగ వస్తోందంటే.. అందరికీ పండుగే. మరి సినిమాలకు కూడా ఇది పెద్ద పండుగనే చెప్పాలి. జనాలకు ప్రత్యేకంగా గుర్తుండడం కోసం.. దాదాపు సెట్స్ పై ఉన్న ప్రతీ సినిమానీ.. ఏదో ఓ సందర్భంతో వార్తల్లోకి తెస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా తన కొత్త మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు.

సాధారణంగా ఫస్ట్ లుక్ అంటే.. మూవీకి సంబంధిచిన కీలక సన్నివేశాన్నో, హీరోహీరోయిన్లలో రిలీజ్ చేయడమో.. లేక సినిమాకి సంబంధించిన థీమ్ ను చెప్పేందుకు ప్రయత్నించడమో చేస్తారు. కానీ ఇక్కడున్నది త్రివిక్రమ్. అలాంటివేం కుదరవు. ఫస్ట్ లుక్ అంటే... కేవలం 'అఆ' టైటిల్ మాత్రమే. ఈ టైటిల్ అ అంటే అనసూయ రామలింగ్.. ఆ అంటే ఆనంద్ విహారి అని ఇంతకు ముందే మనకి తెలుసు. కానీ ఇప్పుడు అ..ఆ.. అక్షరాల్లోనే వేరియేషన్ చూపించడం ఆకట్టుకునే విషయం.

అ అక్షరానికి ఓ బొట్టు పెట్టి.. చూడగానే అమ్మాయిలా తీర్చిదిద్దారు. అలాగే ఆ అక్షరాన్ని చూడగానే అబ్బాయి అనిపించడం సహజం. ఈ రెండు అక్షరాలను మెలివేసి రాయడం చూస్తే.. ఆడ, మగ రిలేషన్ ని ఇండికేట్ చేశారు. రెండు అక్షరాల్లో ఇన్ని భావాలను చెబుతున్నారంటే.. ఇక సినిమాలో మాటలతో మాంత్రికుడు ఎన్ని మాయలు చేయబోతున్నాడో అనిపిస్తుంది. అనిరుధ్ స్వరపరిచిన పాటలను త్వరలో రిలీజ్ చేసి, ఫిబ్రవరిలో అ..ఆ.. రిలీజ్ చేసేందుకు త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నాడు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.