Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: అ..ఆ.. అందంగా.. ఆహ్లాదకరంగా..
By: Tupaki Desk | 2 May 2016 4:41 PM GMTఅచ్చం కొత్తగా ఉండే కొత్త సినిమాను తీశాడు త్రివిక్రమ్. ప్రతీసారీ హీరోయిజమ్.. హీరోల తాలూకు ఇమేజ్.. వాటి నుండి జాలువారే భారీ రేంజ్ యాక్షన్ సన్నివేశాలు.. ఇలా సాగుతున్న తన పంథాను.. ''అ..ఆ'' సినిమాతో పూర్తిగా మార్చేశాడు త్రివిక్రమ్. ఈసారి ఒక దృశ్యం కావ్యం ఏదో చెక్కినట్లున్నాడు. ట్రైలర్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది మరి. ఈ ట్రైలర్ టాక్ గురించి చెప్పాలంటే మూడు భాగాలుగా చెప్పొచ్చు.
ఓపెనింగ్.. ట్రైలర్ అంతా సమంతతోనే నిండిపోయింది. నితిన్ తక్కువ. కాకపోతే వారి మధ్య లవ్ పాళ్ళు కాస్త ఎక్కువనే చెప్పాలి. మిడిల్ పార్టు.. హీరోకి ఒక చెల్లి.. ఆమె తాలూకు పంచ్ లు పొగరులు.. ''రావణాసురుడి మమ్మీ డాడీ కూడా సూర్పణకను సమంత అనే అనుకుంటారు కదే.'' అని రావు రమేష్ అంటే.. ''రావాణాసురుడి భార్య కూడా.. వాళ్ళాయన్ను పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది'' అంటూ చెల్లి క్యారెక్టర్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ రిప్లయ్ ఇస్తుంది. దీని బట్టి చూసుకోండి. ఇక ఎండింగ్. ఏమవుతుందో మనకూ తెలియదు. కాకపోతే నితిన్-సమంత లవ్ ప్యారడైజ్ లో ఏదో ప్రాబ్లం ఉందని మాత్రం చెప్పగలం.
త్రివిక్రమ్ తాలూకు డైలాగుల పటుత్వం.. నటరాజ్ సుబ్రమణియన్ తీసిన విజువల్స్ పదును.. మిక్కీ జె మేయర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ లో ఉన్న పట్టు.. అన్నీ కలపి ''అ..ఆ'' సినిమాను ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కమ్ ప్రేమ కథగా ప్రెజంట్ చేశాయని చెప్పొచ్చు. అందంగా ఆహ్లాదకరంగా ఈ ట్రైలర్ బాగుంది.