Begin typing your search above and press return to search.

శ‌ర్వా ఆడాళ్లు టైటిల్ సాంగ్ వ‌చ్చేసింది!

By:  Tupaki Desk   |   3 March 2022 5:31 PM IST
శ‌ర్వా ఆడాళ్లు టైటిల్ సాంగ్  వ‌చ్చేసింది!
X
శ‌ర్వానంద్ న‌టించిన తాజా చిత్రం .`ఆడాళ్లు మీకు జోహార్లు`. కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రం మ‌రి కొన్ని గంట‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించారు.

శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్ పై చెరుకూరి సుధాక‌ర్ నిర్మిస్తున్నారు. ఈ శుక్ర‌వారం ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం గురువారం టైటిల్ సాంగ్ వీడియోని హీరో రానా సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు.

ఈ సందర్భంగా సినిమా శ‌ర్వాకు చిత్ర బృందానికి మంచి విజ‌యాన్ని అందించాల‌ని కోరుకున్నారు. దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ చిత్ర టైటిల్ సాంగ్ కి శ్రీ‌మ‌ణి సాహిత్యం అందించారు. శ‌ర్వానంద్ పై ఈ పాట‌ని చిత్రీక‌రించారు. దేవిశ్రీ‌ప్ర‌సాద్ ఆల‌పించారు. ఇప్ప‌టికే విడుద‌లైన లిరిక‌ల్ వీడియోలు మంచి ఆద‌ర‌ణ పొందాయి. తాజాగా హైద‌రాబాద్ లోని ఓ మిడిల్ క్లాస్ కాల‌నీలో శ‌ర్వానంద్ పై చిత్రీక‌రించిన టైటిల్ సాంగ్ వీడియోని విడుద‌ల చేశారు.

ఈ పాట‌కు మాస్ట‌ర్ శేఖ‌ర్ వీజే డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఈ పాట‌కో విశేషం వుంది. ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభించిన ఈ పాట చిత్రీక‌ర‌ణ అర్థ్రరాత్రి 2 గంట‌ల‌కు ముగించారు. సాంగ్ మొత్తం ఫైన‌ల్ అయ్యాకే టీమ్ ప్యాక‌ప్ చెప్పేసింది.

అంత వ‌ర‌కు ఓపిక‌గా హీరో శ‌ర్వానంద్ ఈ పాట కోసం వెయిట్ చేయ‌డం విశేషం. అంతే కాకుండా ఈ పాట‌లో శ‌ర్వా వేసిన స్టెప్పులు... ప‌లికించిన హావ భావాలు సినిమాలో ఈ సాంగ్ ని హైలైట్ అయ్యేలా చేస్తుంద‌ని చెబుతున్నారు.

ఇదిలా వుంటే గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్న శ‌ర్వానంద్ ఈ మూవీతో ఎలాగైనా మ‌ళ్లీ ట్రాక్ లోకి రావాల‌నికుంటున్నార‌ట. గ‌త చిత్రాల‌కు మించి ఈ మూవీపై ప్ర‌త్యేక శ్రద్ధ‌ని పెట్టార‌ని, ప్ర‌తీ విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుని శ‌ర్వానంద్ ఈ మూవీ చేశార‌ని చెబుతున్నారు.

అంతే కాకుండా ఇటీవ‌ల `పుష్ప‌`తో హిట్ ని సొంతం చేసుకున్న ర‌ష్మిక కూడా ఈ మూవీకి ప్ర‌ధాన ఎస్సెట్ గా నిల‌వనుంద‌ని, శ‌ర్వా - ర‌ష్మిక మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు, కెమిస్ట్రీ ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని ఖ‌చ్చితంగా ఆక‌ట్టుకుంటుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.