Begin typing your search above and press return to search.

ఫూల్స్ డే కి 'ఆడవాళ్లు మీకు జోహార్లు'

By:  Tupaki Desk   |   7 March 2022 2:30 AM GMT
ఫూల్స్ డే కి ఆడవాళ్లు మీకు జోహార్లు
X
శర్వానంద్‌ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ సినిమా పై అన్ని వర్గాల వారు చాలా నమ్మకం పెట్టుకున్నారు. కిషోర్ తిరుమల సినిమా అంటే లవ్‌ కమ్‌ ఫ్యామిలీ డ్రామా అన్నట్లుగా సినిమా ఉంటుంది అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. కాని సినిమా పర్వాలేదు అని అనిపించింది . విడుదల అయిన మొదటి రోజే సినిమాకు మిక్స్డ్ రివ్యూలు మొదలు అయ్యాయి.

హీరో మరియు హీరోయిన్‌ జోడీకి మంచి పేరు రావడంతో పాటు కొన్ని ఫ్యామిలీ అండ్‌ ఎంటర్‌టైన్‌ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఒక మోస్తరుగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ను ఆధరిస్తున్నారు.

దాంతో గౌరవ ప్రథమైన వసూళ్లు నమోదు అవుతున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సినిమా మొదటి మూడు రోజులు బాగానే వసూళ్లన దక్కించుకుందని మేకర్స్‌ అంటున్నారు.

ఇక ఈ సినిమా ను థియేటర్ లో చూసేందుకు ఆసక్తి లేని కొందరు ఓటీటీ అలర్ట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ను సోనీ లివ్‌ లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.

ఈమద్య కాలంలో సోనీ లివ్ వారు తెలుగు లో పెద్ద సినిమాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాను వారు పోస్ట్‌ థియేట్రికల్‌ రైట్స్ కొనుగోలు చేయడం జరిగిందట.

ఈమద్య కాలంలో అన్ని సినిమాలు కూడా థియేటర్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. ఈ సినిమా కూడా విడుదలైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ కు రెడీ అవ్వబోతుంది. అంటే ఏప్రిల్‌ 1వ తారీకున ఫూల్స్ డే కి సోనీ లివ్‌ లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా వరల్డ్‌ డిజిటల్ ప్రీమియర్ అవ్వబోతుంది అంటూ యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

డిజిటల్ ప్రీమియర్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా డిజిటల్‌ ప్రీమియర్ గురించి ఇప్పుడే అధికారికంగా ప్రకటించడం ద్వారా వసూళ్ల పై ప్రభావం పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శర్వానంద్‌ అభిమానులు ఇప్పటికే తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. ముందు ముందు అయినా ఆయన మంచి సినిమాలతో.. మునుపటి తరహా విభిన్నమైన సినిమాలతో రావాలని ఆశిస్తున్నామని అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.