Begin typing your search above and press return to search.
కిషోర్ తిరుమల ఆ మూవీని అన్ని సార్లు చూశారా?
By: Tupaki Desk | 18 Feb 2022 12:30 AM GMTటాలీవుడ్ లో టాలెంటెడ్ రైటర్స్ దర్శకులు గా మారి అత్యున్నతమైన చిత్రాలని అందిస్తున్నారు. త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల శివ.. ఇలా చాలా మందే స్టార్ రైటర్లు స్టార్ డైరెక్టర్ లుగా మారి బ్లాక్ బస్టర్ చిత్రాలని అందిస్తున్నారు. వీరి బాటలోనే స్టార్ రైటర్‌గా సూపర్ హిట్ చిత్రాలకు రచయితగా, డైలాగ్ రచయితగా వర్క్ చేసిన కిషోర్ తిరుమల `నేను శైలజ` చిత్రంతో దర్శకుడిగానూ సక్సెస్ బాట పట్టిన విషయం తెలిసిందే.
ఉన్నది ఒకటే జిందగీ, చిత్ర లహరి వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాల్ని అందుకున్న ఆయన రామ్ తో `రెడ్` పేరుతో తొలిసారి యాక్షన్ థ్రిల్లర్ మూవీని చేశారు. ఈ మూవీ తరువాత ఆయన కంప్లీట్ ఫ్యామిలీ అంశాల నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. శర్వానంద్ హీరోగా నటించారు. క్రేజీ లేడీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 25న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
శర్వానంద్ కెరీర్‌కి అత్యంత కీలకంగా మారిన ఈ మూవీ గురించి దర్శకుడు కిషోర్ తిరుమల పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. విక్టరీ వెంకటేష్ తో చేయాలనుకున్న కథ ఇది కాదని, హీరో క్యారెక్టర్ ని మార్చకుండా కథని మార్చి ఈ సినిమా చేశానన్నారు. మన ఇంటిలోనూ మన చుట్టూ వున్న స్త్రీలు మనకు చాలా ప్రముఖ్యత నిస్తారు. సదుద్దేశ్యంతో మన జీవితాలని తీర్చిదిద్దుతుంటారు. వారి మనస్థత్వాలు ఆసక్తికరంగా వుంటాయి.
వారు చిన్ని చిన్న ఆనందాలను మాత్రమే కోరుకుంటుంటారు. వారు తమ పురుషులపై భారీ డిమాండ్లు చేయరు. అలాంటి ఆడవాళ్ల కు గుర్తుగా మంచి సినిమా తీయాలని భావించి ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేశానంటున్నారు కిషోర్ తిరుమల. శర్వానంద్ చాలా రోజులుగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలని అడుగుతున్నారు. అందుకే ఆయనని ఈ చిత్రానికి ఎంచుకున్నాను. అతనికి ఇందులో ఐదుగురు అక్కాచెల్లెళ్లు వుంటారు. వారు అతన్ని ఎంత గారాబంగా చూసుకుంటోరో ఇందులో చూపించాం. ఈ మూవీ రన్ టైమ్ 1:41 గంటలు.
చక్కని భావోద్వేగాల సమాహారంగా సాగే సినిమా వచ్చి చాలా కాలమౌతోంది. ఆ లోటును తీర్చే చిత్రమిది. కుటుంబ కథా చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. `మురారి` చిత్రాన్ని 14 సార్లు చూశాను. ఈ మూవీ తరువాత డీవీవీ దానయ్య తో ఓ సినిమా చేయబోతున్నాను. దీనికి నాగచైతన్య అనుకుంటున్నాం` అని తెలిపారు కిషోర్ తిరుమల. ఇదిలా వుంటే ఈ మూవీ ట్రైలర్ ఈ నెల 19న విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా గురువారం సరికొత్త పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న విషయం తెలిపిందే. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో హీరో శర్వానంధ్ చుట్టూ ఆడవాళ్ల వుండగా మధ్యలో కింద కూర్చుని కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది.