Begin typing your search above and press return to search.

మ‌ర‌క‌త‌మ‌ణి సీక్వెల్ కి ఆది రెడీ!

By:  Tupaki Desk   |   19 Dec 2022 4:30 PM GMT
మ‌ర‌క‌త‌మ‌ణి సీక్వెల్ కి ఆది రెడీ!
X
కోలీవుడ్ యంగ్ హీరో ఆదిపినిశెట్టి హీరోగా న‌టిస్తూనే...ప్ర‌తి నాయ‌కుడు పాత్ర‌ల్లోనూ మెప్పిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక వైవిథ్య‌మైన క‌థాబ‌లం ఉన్న చిత్రాలు చేయ‌డం ఆది ప్ర‌త్యేక‌త‌.యంగ్ మేక‌ర్స్ ఇన్నోవేటివ్ ఐడియాల్ని ప్రోత్స‌హించ‌డంలో న‌యా స్టార్ ముందుంటాడు. ఇప్ప‌టికే అలాంటి వారిని ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం చేసాడు. ఆ ర‌కంగా త‌మిళ‌...తెలుగు ఇండ‌స్ర్టీలో ఆదికి మంచి పేరుంది.

ఇటీవ‌లే 'వైశాలి' చిత్రాన్ని తెర‌కెక్కించిన అరివ‌ళ‌గ‌న్ తో 13 ఏళ్ల త‌ర్వాత చేతులు క‌లిపారు ఆది . ప్ర‌స్తుతం ఇద్ద‌రి ఆ కాంబినేష‌న్ లో 'శ‌బ్దం' అనే టైటిల్తో మ‌రో హార‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆది పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సినిమాకి సంబంధించిన గ్రిప్పింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. రద్దీగా ఉండే గబ్బిలాలు ఓ భారీ చెవిలోకి ప్రవేశించడం. వింతైనా గబ్బిలాల శబ్దం..ప్ర‌తిధ్వ‌నులు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. పోస్ట‌ర్ లోనే చాలా విష‌యం ఉన్న సినిమాగా హైలైట్ అవుతుంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో హిట్ సినిమాకి సీక్వెల్ చేయ‌డానికి కూడా ఆది రెడీగా ఉన్న‌ట్లు తెలిపారు. ఆది అభిమాని ఒకరు 'మరగధ నానయం' (తెలుగులో 'మరకత‌మణి')కి సీక్వెల్ చేయమని అడిగారు. దీనికి ఆది ప్రతిస్పందిస్తూ.. తాను కూడా చేయడానికి వేచి ఉన్నానని తెలిపారు.

దీంతో హిట్ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేయాలా? లేదా? అన్న‌ది ద‌ర్శ‌కుల నిర్ణ‌యంగా తెలుస్తోంది.సీక్వెల్ క‌థ రెడీ చేస్తే న‌టించ‌డానికి ఆది రెడీగా ఉన్నట్లు ప్ర‌క‌టించేసారు. మ‌రి మేక‌ర్స్ ఏమంటారో చూడాలి. మ‌ర‌క‌త‌మ‌ణికి ఆర్క్ శరవణ్ దర్శకత్వం వహించారు. ఇది హారర్ కామెడీ చిత్రం. ఇందులో ఆదికి జోడీగా నిక్కీ గల్రానీ న‌టించింది.

అయితే ఈ సినిమాకి సీక్వెల్ చేస్తున్న‌ట్లు గ‌తంలోనే వార్త‌లొచ్చాయి. కోవిడ్ స‌మ‌యంలో క‌థ రెడీ అయిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. కానీ తాజాగా ఆది మాట‌ల్ని అవ‌న్ని త‌ప్పుడు క‌థ‌నాలని తెలుస్తోంది. మరి ఆది తాజా నిర్ణ‌యం నేప‌థ్యంలో మేక‌ర్స్ రియాక్ష్ ఎలా ఉంటుందో చూడాలి. నటుడిగా ఆది స్పాన్ కూడా పెరిగింది. ఏక‌కాలంలో త‌మిళ్ తో పాటు తెలుగులోనూ ఆయ‌న చిత్రాలు రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.