Begin typing your search above and press return to search.

యంగ్ హీరో క‌ట్న‌కానుక‌లు హాట్ టాపిక్

By:  Tupaki Desk   |   3 Jun 2022 2:18 PM GMT
యంగ్ హీరో క‌ట్న‌కానుక‌లు హాట్ టాపిక్
X
ఈరోజుల్లో క‌ట్న‌కానుక‌లు లేనిదే పెళ్లాడే సీన్ లేదు. వ‌రుడు వ‌ద్దన్నా వ‌ధువు త‌ల్లిదండ్రులు అంతో ఇంతో క‌ట్న‌ కానుక‌లిచ్చి పంపించ‌డం సాంప్ర‌దాయం. అయితే తెలుగు కుర్రాడైన ట్యాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి క‌ట్నకానుక‌ల వ్య‌వ‌హారం ఇటీవ‌ల ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంత‌కీ నిక్కీ గ‌ర్లానీ ఫ్యామిలీ అత‌గాడికి ఏమేర‌కు క‌ట్టం స‌మ‌ర్పించుకుని ఉంటుంది? అంటూ సోష‌ల్ మీడియాల్లో పెద్ద డిబేట్ ర‌న్ అవుతోంది. యువ‌హీరో భారీగానే దండుకుని ఉంటాడంటూ ఒక సెక్ష‌న్ త‌మిళ మీడియా స్పెక్యులేటెడ్ క‌థ‌నాలను వండి వార్చింది. అయితే ఇది నిజ‌మా అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీ జంట పెద్ద‌లు కుదిర్చిన ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 2022 మార్చిలో నిశ్చితార్థం జరిగిన రెండు నెలల తర్వాత చెన్నైలో వివాహం చేసుకున్నారు. ఈ జంట‌ హిందూ సంప్రదాయం ప్రకారం వివాహానికి ముందు ఆచారాలను పాటిస్తున్న ఫోటోలు వీడియోలు వైర‌ల్ అయ్యాయి. చెన్నైలో ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. వేడుకకు ఆర్య- నాని- సందీప్ కిషన్ సహా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

ఆది- నిక్కీ జంట‌ వివాహ వేడుక `హల్దీ` ఫంక్షన్ తో ప్రారంభమైంది. ఈవెంట్ నుండి కొన్ని ఫోటోలు మొదట్లో సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అనంత‌రం మార్చి 24న సన్నిహితులు బంధుమిత్రుల స‌మ‌క్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ సమయంలో ఈ జంట తమ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మా శ్రేయోభిలాషులందరి సమక్షంలో వివాహం చేసుకోవడం నిజంగా ఆనందించే క్షణం. మేము కలిసి ఈ కొత్త ప్రయాణాన్ని మొద‌లుపెడుతున్నందున‌ మీ ఆశీర్వాదాలు ప్రేమ కావాలి.. అని కోరారు.

నిజానికి ఆది- నిక్కీ జంట ప్రేమ వ్య‌వ‌హారంపై హింట్ ఇచ్చిన‌ది తెలుగు స్టైలిస్ట్ నీరజ కోన. తెలుగు - తమిళ ప‌రిశ్ర‌మ‌ల్లో నీర‌జ కోన బిజీ డిజైన‌ర్ గా పని చేస్తున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో ఈ ప్రేమ వ్య‌వహారం రివీలైంది. ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీ గత చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. మరగతా నానయం - యాగవరాయినుమ్ నా కాక్క -మలుపు అనే తమిళ-తెలుగు ద్విభాషా చిత్రాలలో కలిసి పనిచేసిన క్ర‌మంలో ఈ జంట‌ ఒకటయ్యారు. పెద్ద‌ల ఆశీస్సుల‌తో ఒక ఇంటి వార‌య్యారు. ఇక ఆది పినిశెట్టి తెలుగు -త‌మిళ భాష‌ల్లో న‌టిస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇంత‌కీ ఈ పెళ్లికి ఆది పినిశెట్టి ఎంత క‌ట్నం తీసుకున్నాడు ? అంటే.. అస‌లు క‌ట్నం అన్న‌దే తీసుకోలేద‌ని తెలిసింది. ఈ విష‌యంలో ఆది ఆద‌ర్శం అంటూ త‌మిళ మీడియా క‌థ‌నాలు వెలువ‌రించింది. నిజానికి అత‌డు ఆశిస్తే నిక్కీ కుటుంబం క‌ట్నం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కానీ అత‌డు ఒక్క రూపాయి క‌ట్నం కూడా ఆశించ‌కుండా త‌న ప్రియురాలిని పెళ్లాడేసాడు.