Begin typing your search above and press return to search.
`రంగస్థలం`లో ఆది పినిశెట్టి పాత్రలా
By: Tupaki Desk | 28 Aug 2021 5:07 AM GMTనటుల నుంచి ప్రతిభను రాబట్టుకోవడంలో లెక్కల మాస్టార్ సుకుమార్ తరవాతే. కేవలం హీరో పాత్రనే కాదు తన స్నేహితులు లేదా సోదరుల పాత్రలను విలన్ లను హైలైట్ చేయాలంటే ఆయన తర్వాతే. నువ్వా నేనా? అంటూ తలపడే పాత్రల్ని క్రియేట్ చేసి షో ఆద్యంతం రంజింపజేయడం లెక్కల మాస్టారు ప్రతిభకు నిదర్శనం. ఇంతకుముందు ఆర్య సిరీస్ లో బన్నీ చేష్టలకు బకరాలయ్యే పాత్రలను కూడా అద్భుతంగా మలిచిన సుకుమార్ ఇటీవల రంగస్థలంలో ఆదిపినిశెట్టి పాత్రను గొప్ప ఔచిత్యంతో తీర్చిదిద్దారు. చరణ్ సోదరుడిగా ఆది పినిశెట్టి పాత్ర మరణం సినిమాలో ఎమోషన్ ని రగిలిస్తుంది.
ఇప్పుడు పుష్ప -1 కోసం అలాంటి పాత్రను సుకుమార్ క్రియేట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో అజయ్ నటిస్తారు. పుష్పరాజ్ (బన్ని)కి సోదరుడిగా అజయ్ త్యాగం చేసేవాడిగా కనిపించనున్నాడట. ఆ పాత్ర ఎమోషనల్ గ్రాఫ్ ని పెంచుతుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఇందులో పుష్పరాజ్ అనే గంధపు చెక్కల స్మగ్లర్ గా బన్ని నిటిస్తుండగా.. త సోదరుడిగా అజయ్ కి నటన పరంగా స్కోప్ ఉన్న పాత్ర లభించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో సుకుమార్ - అల్లు అర్జున్ ఆర్య 2 లో అజయ్ ప్రధాన విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బ్రదర్ పాత్రతో అలరించనున్నారు. ఇక ఇందులో ప్రధాన విలన్ గా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
పుష్ప డ్యూయాలజీలో మొదటి భాగం ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అనసూయ ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు.. టీజర్ లు .. మొదటి సింగిల్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనలను అందుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
పుష్ప రిలీజ్ తేదీపై డైలమా?
అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప దసరా బరిలో వస్తుందని ఇంతకుముందు ప్రచారమైనా మహమ్మారీ అంతా మార్చేసింది. ఇప్పుడు క్రిస్మస్ కానుకగా విడుదలవుతుందని ప్రచారమవుతోంది. కానీ దానిపైనా పూర్తి క్లారిటీ మిస్సయ్యింది. ఆకస్మికంగా చిరు నటించిన ఆచార్య రిలీజ్ తేదీ మారింది. `ఆచార్య`ను క్రిస్మస్ 2021 కి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని కథనాలొచ్చాయి. అయితే ఆచార్య వస్తే పుష్ప పరిస్థితేమిటి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ చిరంజీవి కోసం త్యాగం చేయాల్సి వస్తే `పుష్ప: రైజ్ పార్ట్ -1` సమ్మర్ 2022 కి వాయిదా వేయాల్సి ఉంటుంది. చిరు - కొరటాల ఇద్దరూ మైత్రి మూవీ మేకర్స్ తో గొప్ప అనుబంధం కలిగి ఉన్నారు. అందుకే క్రిస్మస్ రిలీజ్ కి మైత్రి సంస్థ లైన్ క్లియర్ చేస్తుంది. ఇక మావయ్య కోసం బన్ని తన రిలీజ్ తేదీని త్యాగం చేస్తాడన్న టాక్ కూడా ఉంది. అందుకే ఇప్పుడు పుష్ప రిలీజ్ 2022 సమ్మర్ కి వెళుతుందా? అన్నది సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా .. ఆచార్య.. పుష్ప రిలీజ్ తేదీలపై నిర్మాణ సంస్థల నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
సంక్రాంతి క్రిస్మస్ బరిలో పలు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటిలో భీమ్లా నాయక్- సర్కార్ వారి పాట సంక్రాంతి రిలీజ్ తేదీలు ఇప్పటికే వెల్లడించారు. రాధేశ్యామ్ సంక్రాంతికి బరిలోనే వస్తోంది. ఆ మేరకు వాయిదాను ప్రకటించారు మేకర్స్. ఆర్.ఆర్.ఆర్ ని కూడా సంక్రాంతి బరిలో తెస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేజీఎఫ్ 2 రిలీజ్ తేదీపైనా ఇంకా డైలమా కొనసాగుతోంది. వీటన్నిటి నడుమా పుష్ప రిలీజ్ తేదీపై డైలమా ఇంకా కొనసాగుతోంది. చిత్రబృందం మరోసారి దీనిపై అధికారికంగా క్లారిఫికేషన్ ఇస్తుందేమో చూడాలి.