Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: స్ఫూర్తిని రగిలించే స్పోర్ట్స్ డ్రామా
By: Tupaki Desk | 6 March 2022 3:52 PM GMTవైవిధ్యమైన కాన్సెప్టులు ఎంచుకుంటూ ఇంత పోటీ ప్రపంచంలోనూ తనని తాను నిలబెట్టుకున్నాడు ఆది పినిశెట్టి. గుండెల్లో గోదావరి- రంగస్థలం లాంటి చిత్రాల్లో అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. అతడు నటించిన తదుపరి చిత్రం క్లాప్ ని ఓటీటీ ప్లాట్ ఫారమ్ లో ప్రదర్శించనున్నట్లు ఇటీవల సోనీ LIV ప్రకటించింది. ఈరోజు ఓటీటీలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసింది. ట్రైలర్ ఆద్యంతం ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా రక్తి కట్టించింది.
ఆ వీడియోలో ఆదిని అంగవైకల్యం కలిగిన అథ్లెట్ గా చూపించారు. జాతీయ ఛాంపియన్ కి ఒక చిన్న గ్రామానికి చెందిన ఒక యువ మహిళా అథ్లెట్ గురించి తెలుసు. ఆమెకు శిక్షణ ఇవ్వమని అతను చాలా మంది కోచ్ లను అడుగుతాడు కానీ ఫలించదు. తరువాత అతను ఆమెకు స్వయంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు.
తర్వాత ఏమి జరిగింది? ఆమె జాతీయ ఛాంపియన్ అవుతుందా? అనేది థీమ్. ఇందులో ఎమోషన్ రగిలించేందుకు చాలా స్కోప్ కనిపిస్తోంది. ఆది లాంటి పెర్ఫామర్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అనడంలో సందేహం లేదు.
ఈ చిత్రం 11 మార్చి 2022న ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుందని సోనీ LIV ధృవీకరించింది. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్ - కృష్ణ కురుప్- ప్రకాష్ రాజ్ - నాజర్ - బ్రహ్మాజీ తదితరులు నటించారు. ఈ స్పోర్ట్స్ డ్రామాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.