Begin typing your search above and press return to search.

వివాదంతో ప్ర‌చారం కుద‌ర‌దిక‌!

By:  Tupaki Desk   |   19 Aug 2018 6:22 AM GMT
వివాదంతో ప్ర‌చారం కుద‌ర‌దిక‌!
X
వివాదంతో ప్ర‌చారం కొట్టేద్దామ‌నేది కొంద‌రు నిర్మాత‌ల ప్లాన్‌. మంచో చెడో ఏదో ఒక వివాదం క్రియేట్ చేస్తే దానికి ఉచిత ప్ర‌చారం ద‌క్కుతుంద‌నే గుంట‌న‌క్క తెలివితేట‌ల‌కు కొద‌వేం లేదు. వేలం వెర్రిగా మీడియా వెంట‌ప‌డుతుంది కాబ‌ట్టి ఈ ప్లాన్ పెద్ద‌గానే వ‌ర్క‌వుట‌వుతోంది. అయితే ఇలాంటి ఉత్త ప్ర‌చారాల‌కు ఇక‌మీద‌ట సినీమీడియా ప్ర‌చారం చేయ‌కుండా నిలువరించాల‌న్న ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది. వివాదంలో నిజం ఎంత‌? అన్న‌ది పూర్తిగా ఆరాతీసి అది నిజ‌మైతేనే ప్ర‌చారం చేసే ఆలోచ‌న‌లోనూ మీడియా త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది.

ఇటీవ‌లి కాలంలో ట్రెండ్ చూస్తుంటే ఎవ‌రో ఎక్కించే కొన్ని అప‌దృష్ట వార్త‌ల‌కు వ‌స్తున్న ప్ర‌చారం వాస్త‌వికంగా సినిమాలో కంటెంట్ ఎంత‌? అన్న‌దానిపైన‌ రావ‌డం లేద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. సినిమాలో విష‌యం ఉంటే గీత గోవిందంలా ప్ర‌చారం వ‌స్తుంది. అదే అందులోనైనా విష‌యం లేక‌పోతే అంతే నెగెటివ్ ప‌బ్లిసిటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. హిట్టు సినిమాకి మంచి రివ్యూలు రాస్తే గ‌మ‌నించ‌ని వాళ్లు - ఫ్లాప్ సినిమాని ఫ్లాప్ అని రాస్తే మాత్రం రోషం పొడుచుకొచ్చేస్తుంది. మా సినిమాని కిల్ చేశారంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తారు.

ఇక‌పోతే ఇదే పాయింట్‌ పై సీనియ‌ర్ రైట‌ర్ కోన వెంక‌ట్ ఆస‌క్తిక‌ర డిబేట్‌ కి తెర తీశారు. ఈనెల 24న ఆది పినిశెట్టి- కోన కాంబో మూవీ `నీవెవ‌రో` రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ ముంగిట వివాదం క్రియేట్ చేయాల‌ని కోన‌కు హీరో ఆది సూచించార‌ట‌. దాంతో ప్ర‌చారం బావుంటుంద‌నేది అత‌డి ఆలోచ‌న‌. అయితే అది స‌రికాద‌ని కోన వారించాన‌ని చెప్పారు. సినిమాలో కంటెంట్ లేక‌పోతే ఎంత వివాదం క్రియేట్ చేసినా క‌ష్ట‌మేన‌ని, విష‌యం ఉంటేనే జ‌నాలు ఆద‌రిస్తున్నార‌ని తాను చెప్పాన‌ని ఓ వేడుక‌లో అన‌డం చ‌ర్చ‌కొచ్చింది. మొత్తానికి వివాదంతో ప్ర‌చారం కొట్టేయొచ్చేమో కానీ, హిట్టు కొట్టేయ‌డం క‌ష్టం. కంటెంట్‌ తో జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే ప్లాన్ చేయ‌డ‌మే మేలన్న‌ది మ‌న మేక‌ర్స్ గ్ర‌హించాలి.