Begin typing your search above and press return to search.

ఆది... నాలుగో సింహం!

By:  Tupaki Desk   |   9 Jan 2016 4:01 AM GMT
క‌నిపించ‌ని నాలుగో సింహ‌మే రా పోలీస్‌.. అంటూ సాయికుమార్ మీసం మెలేసిన వైనం గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా తెలుసు. పోలీస్ స్టోరీ సినిమాలో ఆయ‌న ప‌వ‌ర్‌ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ గా క‌నిపించి హంగామా చేశాడు. ఆ చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌నాలు సృష్టించింది. పోలీస్ క‌థ‌ల్లో ట్రెండ్ సెట్ట‌ర్‌ గా నిలిచింది. అందులో డైలాగులు ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉంటాయి. సాయికుమార్ పోషించిన ఆ పోలీస్ పాత్ర‌ని ఇమిటేట్ చేసేవాళ్లు ఇప్ప‌టికీ క‌నిపిస్తూనే ఉంటారు. ఆ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొచ్చి ఎన్నేళ్ల‌య్యిందో తెలుసా? 20యేళ్లు. ఒక సినిమా ప్రేక్ష‌కుల‌కు 20యేళ్ల‌కిపైగా గుర్తుందంటే విశేష‌మే క‌దా మ‌రి! ఆ సినిమాకి ట్రిబ్యూట్‌ గా ఇప్పుడు జూనియ‌ర్ సింహం గ‌ర్జించింది. అదేనండీ... సాయికుమార్ త‌న‌యుడు ఆది నాలుగో సింహ‌మేరా ఈ పోలీస్... అనే డైలాగ్ చెప్పాడు. తండ్రి డైలాగ్ డెలివ‌రీని అనుక‌రిస్తూ ఆది డ‌బ్‌ స్మాష్‌ లో వీడియో చేశాడు. ఆదికి తొలి డ‌బ్‌ స్మాష్ వీడియో ఇదే కావ‌డం విశేషం. త‌న తండ్రి డైలాగ్‌ తోనే మొద‌లుపెట్టాడ‌న్న‌మాట‌. నాలుగో సింహంలా ఆది క‌నిపిస్తాడో లేదో తెలియ‌దు కానీ.. త‌న తండ్రి చెప్పిన‌ట్టుగానే వేగంగా... ప‌వ‌ర్‌ ఫుల్‌ గా డైలాగ్ చెప్పేశాడు. అది నెట్‌ లో వైర‌ల్ అవుతోంది. అన్న‌ట్టు త్వ‌ర‌లోనే ఆది `గ‌రం` కుర్రాడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Watch here: https://www.facebook.com/ActorAadi/videos/vb.112222978975229/419257978271726/?type=2&theater