Begin typing your search above and press return to search.

ఐతే పవన్.. కాదంటే ప్రభాస్.. ఇది ఫిక్స్

By:  Tupaki Desk   |   11 Dec 2015 3:10 PM
ఐతే పవన్.. కాదంటే ప్రభాస్.. ఇది ఫిక్స్
X
పబ్లిసిటీ కోసం టాప్ స్టేజ్ లో స్టార్ హీరోని ఉపయోగించుకోవండి చిన్నా చితకా హీరోలు, కొత్త హీరోలకు కామన్. ఇలాంటి అడ్వాంటేజ్ కోసమే శంకరాభరణం సినిమా కోసం పవన్ కళ్యాణ్ ని నిఖిల్.. ట్రైలర్‌ లాంచ్‌ కు సల్మాన్ ఖాన్ ని అఖిల్ అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే పవన్ కాకపోతే ప్రభాస్ దగ్గరకి వెళ్లిపోవడం.

సాధారణంగా పవన్ కళ్యాణ్ ఎక్కడికీ వెళ్లడు. తన ఫంక్షన్లకే తప్పనిసరి పరిస్థితుల్లో హాజరయ్యే పవర్ స్టార్.. ఇతర హీరోల వేడుకలు అంటే ఆమడ దూరం ఉంటాడు. ఇందుకే శంకరాభారణం ట్రైలర్ ని యూట్యూబ్ లో లాంఛ్ చేయించడం కోసం పవన్ దగ్గరకే వెళ్లాడు నిఖిల్. ఇప్పుడు గరం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆది.. అదే రూట్ ని ఫాలో అయిపోయాడు. డైరెక్టుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటికి వెళ్లిపోయి ట్రైలర్ లాంఛింగ్ చేయించుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తొలిసారిగా ఫోర్బ్స్ సెలబ్రిటీ లిస్ట్ లోకి ఎక్కేసేంతగా ఖ్యాతి సంపాదించాడు.

మిస్టర్ డిపెండబుల్ రోల్ లోకి ఎంటర్ అయిపోయాడు ప్రభాస్. అందుకే ఇప్పుడు బాహుబలి దగ్గరకు సినిమా యూనిట్లు క్యూ కట్టేస్తున్నాయి. ఇక గరం మూవీలో ఆదికి జంటగా ఆదా శర్మ నటించగా.. మదన్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఇప్పటివరకూ హిట్ సినిమాల్లో నటించినా పేరు సంపాదించలేకపోయిన ఆదాశర్మ.. గరంలో బాగా గరంగానే కనిపిస్తోంది. ప్రభాస్ వెనక ఉన్న పోస్టర్ చూస్తే ఈ విషయం బాగానే అర్ధమవుతుంది.