Begin typing your search above and press return to search.

10 క‌థ‌ల కోసం 40మంది హీరోల పోటీ

By:  Tupaki Desk   |   23 Dec 2015 9:30 AM GMT
10 క‌థ‌ల కోసం 40మంది హీరోల పోటీ
X
ఏడాదికి 200 సినిమాలు రిలీజైతే అందులో ఆడేవి 10 సినిమాలు మాత్ర‌మే. అంటే కేవ‌లం 10 క‌థ‌ల కోసం.. 40 మంది హీరోలం పోటీప‌డుతున్నాం అంటూ కొత్త స్టాటిస్టిక్స్‌ ని చెబుతున్నాడు హీరో ఆది. ఇటీవ‌లే ఓ ఆడ‌బిడ్డ‌కు తండ్రి అయన ఆది.. బిడ్డొచ్చిన‌వేళ క‌లిసొచ్చే వేళ అన్న‌ట్టే గ‌రం మూవీతో హిట్టు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సంద‌ర్భంగా గ‌రం గ‌రం సంగ‌తుల‌తో పాటు సొంత బ్యాన‌ర్ విశేషాల్ని ముచ్చ‌టించాడు.

గ‌రం క‌థ న‌చ్చి నాన్న‌గారు స్వ‌యంగా బ్యాన‌ర్‌ ని స్థాపించారు. శ్రీ‌నివాస సాయి స్ర్కీన్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది నా కెరీర్‌లోనే వెరీ స్పెష‌ల్ మూవీ. క‌చ్ఛితంగా హిట్ కొడ‌తాన‌న్న న‌మ్మ‌కం ఉంది. ఈ సినిమాకి పాట‌లు పెద్ద ప్ల‌స్‌. మ‌రోవైపు చుట్టాల‌బ్బాయ్ మూవీ కూడా చాలా బాగా వ‌స్తోంది. వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ఎంతో శ్ర‌ద్ధ తీసుకుని ఆ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఆయ‌న శైలిలో ఆద్యంతం న‌వ్వులు పంచే చిత్ర‌మిది.. అని ఆది చెప్పాడు. చాలామంది ద‌ర్శ‌కులు నా ద‌గ్గ‌రికి వ‌స్తుంటారు. కానీ ఎలాంటి క‌థ‌ని ఎంచుకోవాలి అన్న క‌న్ఫ్యూజ‌న్ ఉంటుంది. చాలా క‌థ‌లు విని న‌చ్చిన‌వాటిని ఎంపిక చేసుకుంటున్నా. ఒకే ఒక్క క‌మ‌ర్షియ‌ల్ హిట్ ప‌డిపోతే చాలు. ఆ త‌ర్వాత పూర్తి క్లారిటీ వ‌చ్చేస్తుంది. ఆ క్ష‌ణం కోస‌మే ఎదురు చూస్తున్నా అని అన్నాడు.

ఇక ఆడ‌బిడ్డ తండ్రిగా ఈ క్ష‌ణం ఎంతో ఆనందాన్ని పొందాన‌ని చెప్పాడు. ఇప్పుడు మా అమ్మా నాన్న‌ల‌పై మ‌రింత గౌర‌వం పెరిగింది. వాళ్లు న‌న్ను ఎంత బాగా చూసుకున్నారో గుర్తొచ్చింది. మా అమ్మాయికి ఏం పేరు పెట్టాలి? అన్న విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాం.. అంటూ ఆది గారాల ప‌ట్టీ విష‌యాల్ని మురిపెంగా చెప్పాడు.