Begin typing your search above and press return to search.

స్టార్ హీరో అవ్వాలని అనుకోవట్లేదు

By:  Tupaki Desk   |   19 Jun 2017 7:25 AM GMT
స్టార్ హీరో అవ్వాలని అనుకోవట్లేదు
X
తమిళ్​,​ కన్నడ హీరోలు కొంత మంది మన తెలుగులో మంచి విలన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆది పినిశెట్టి కూడా తమిళ్ లో అలానే తెలుగులో కూడా హీరోగా చేస్తూనే విలన్ గా నటిస్తున్నాడు. అవ్వడానికి తెలుగోడే కాని.. పెరిగిందంత చెన్నైలోనే. సరైనోడు సినిమా ఇతడికి ప్రతినాయకుడుగా మంచి గుర్తింపు తెచ్చింది.

కట్ చేస్తే ఇప్పుడు పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా విలన్ గా కనపడనున్నాడు. ఆది నటించిన కొత్త సినిమా ‘మరకతమణి’ విడుదలైన సందర్బంగా మనోడు ఈ సినిమా గురించి చెబుతూ. “నేను చేసిన ఈ కొత్త ప్రయత్నంను ప్రేక్షకులు అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య కాలంలో సినిమా నిర్మాణంలో వచ్చిన మార్పు వలనే నేను ఇలా చేయగలుగుతున్నాను అని చెబుతున్నాడు. నేను సినిమా వదిలి వెళ్లవలిసిన టైమ్ కి నా సినిమాలు మీరు చూస్తే నేను చేసే ప్రతి సినిమా కొత్తగా ఉందే అనేలా చేయాలిని నా కోరిక'' అంటూ సెలవిచ్చాడు. ఇకపోతే ​స్టార్ హీరో అవ్వాలి అనేమీ నేను ప్రయత్నం చేయడం లేదు మంచి సినిమాలు చేయాలి అంతే అంటున్నాడు.

ఇప్పుడు ఆది నటించిన మరో తెలుగు సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘నిన్ను కోరి’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. డి‌వి‌వి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నెగెటివ్ టచ్ లేని సెకండ్ హీరోగా నటిస్తుంటే.. పవన్ సినిమాలో మాత్రం పక్కా విలన్ గా నటిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/