Begin typing your search above and press return to search.
సీన్ చేసే ముందు బన్నీ భయపడతాడట
By: Tupaki Desk | 18 April 2016 5:02 PM GMTఅల్లు అర్జున్ గొప్ప నటుడిగా ఏమీ పేరు తెచ్చుకోలేదు. కానీ అతనో బ్యాడ్ యాక్టర్ అని ఎప్పుడూ అనిపించుకోలేదు. నటుడిగా పరిణతి చూపిస్తూ.. ఓ స్టార్ హీరోగా తన అభిమానుల్ని అలరించేలా అన్ని రకాలుగా కష్టపడుతూ సినిమా సినిమాకూ తన రేంజి పెంచుకుంటూ వెళ్తున్నాడు బన్నీ. ఐతే నిజంగా బన్నీ షూటింగ్ టైంలో ఎంత కష్టపడతాడో.. అబిమానుల కోసం ఎంత తపిస్తాడో చాలామందికి తెలియదంటున్నాడు ‘సరైనోడు’లో విలన్ గా బన్నీని ఢీకొట్టబోతున్న ఆది పినిశెట్టి. తమిళంలో హీరోగా మంచి పేరు సంపాదించి.. తెలుగు సినిమాల్లోనూ తనదైన ముద్ర వేయాలని చూస్తున్న ఈ తెలుగు కుర్రాడు.. తన కో స్టార్ బన్నీ మీద ప్రశంసల జల్లు కురిపించాడు.
ఓ సన్నివేశం చేయడానికి ముందు బన్నీ చాలా భయంతో కనిపిస్తాడని.. హీరోగా ఈ స్థాయికి చేరాక కూడా ఈ భయమేంటి అని తాను ఆశ్చర్యపోయానని చెప్పాడు ఆది. తన సన్నివేశాల్లో ప్రతి చిన్న సన్నివేశం కూడా బాగా రావాలని బన్నీ తపిస్తాడని.. ఈ సన్నివేశం ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా.. వాళ్లకు నచ్చేలా ఎలా చేయాలి.. అంటూ ఎంతో ఆలోచించి.. ఆ తర్వాత కెమెరా ముందు నటిస్తాడని ఆది చెప్పాడు. బన్నీలో కనిపించే ఈ భయమంతా అభిమానుల కోసమేనని.. సినిమాలో ప్రతి అంశమూ వాళ్లకు నచ్చేలా ఉండాలని అతను పడే తపన చూస్తే చాలా ఆశ్చర్యమేసిందని ఆది అన్నాడు. ‘సరైనోడు’లో తాను పోషించిన విలన్ పాత్ర తనకు తెలుగులో మంచి బ్రేక్ ఇస్తుందని ఆది ఆశాభావం వ్యక్తం చేశాడు. క్యారెక్టర్ నచ్చడం వల్లే విలన్ పాత్ర అయినా ఒప్పుకున్నానన్నాడు. తేజ దర్శకత్వంలో ‘ఒకవిచిత్రం’ సినిమాతో తెలుగులోనే ముందుగా హీరోగా పరిచయమైన ఆది.. ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’ సినిమాలోనూ లీడ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే.