Begin typing your search above and press return to search.
బన్నీ కంటే నేనే పవర్ ఫుల్
By: Tupaki Desk | 21 April 2016 3:30 PM GMT‘సరైనోడు’లో విలన్ పాత్ర చేస్తున్నానని తెలియగానే చాలామంది తనకు వద్దని చెప్పారని.. అసలు తానెందుకు ఈ పాత్ర ఎంచుకున్నానా అని ప్రశ్నించారని.. ఐతే వాళ్లందరికీ ఈ శుక్రవారం (ఏప్రిల్ 22న) సమాధానం దొరుకుతుందని అన్నాడు ఆది పినిశెట్టి. ‘‘తమిళంలో హీరోగా మంచి పొజిషన్లోనే ఉన్నావుగా.. ఇప్పుడీ విలన్ పాత్ర ఎందుకు చేస్తున్నావని చాలామంది అడిగారు. వాళ్లందరికీ సరైనోడు రిలీజ్ రోజున సమాధానం దొరుకుతుంది. ఇది నా కెరీర్లోనే చాలా ప్రత్యేకమైన సినిమా. హీరోగా కూడా నేను ఇలాంటి పాత్ర చేయలేదు. అసలు ఈ కథ వినడానికి ముందు ఇది రెగ్యులర్ విలన్ పాత్రే అయితే చేయొద్దని అనుకున్నాను. కానీ బోయపాటి నా పాత్ర గురించి చెప్పాక మాత్రం కచ్చితంగా ఈ పాత్ర చేయాల్సిందే అని ఫిక్సయ్యాను’’ అని ఆది చెప్పాడు.
తన పాత్ర గురించి మరింతగా చెబుతూ.. ‘‘నా క్యారెక్టర్.. బన్నీ పాత్ర కంటే పవర్ ఫుల్ గా ఉంటుంది. ప్రతి సన్నివేశంలోనూ నా పాత్రే బన్నీ క్యారెక్టర్ని డామినేట్ చేస్తుంది. ఐతే ఒకప్పుడైతే హీరో పాత్రను విలన్ క్యారెక్టర్ డామినేట్ చేస్తే తెలుగు ప్రేక్షకులు అంగీకరించేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు వాళ్ల అభిరుచి మారింది. నా పాత్ర రెగ్యులర్ తెలుగు సినిమాల విలన్ల తరహాలో ఉండదు. ఈ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అతడికి చెడు అలవాట్లుండవు. అమ్మాయిల మోజుండదు. ఊరికే అరవడు. హడావుడి చేయడు. ఈ పాత్రకు క్లాస్ టచ్ ఉంటుంది. దానికో ఐడియాలజీ ఉంటుంది. ఇవన్నీ చూసే ఈ పాత్ర ఒప్పుకున్నా’’ అని ఆది తెలిపాడు. ‘మలుపు’ తనకు హీరోగా తెలుగులో లైఫ్ ఇస్తే.. ‘సరైనోడు’ విలన్ గా తనకు కొత్త కెరీర్ ఇస్తుందని ఆది అన్నాడు. పాత్ర బాగుంటే ఇకముందూ తానిలాంటి విలన్ పాత్రలు చేయడానికి సిద్ధమని ఆది అన్నాడు.