Begin typing your search above and press return to search.
ఈ తమిళ హీరో బన్నీని ఏం చేస్తాడో...
By: Tupaki Desk | 25 July 2015 11:01 AM GMTఇప్పటి యువహీరోల్లో కొత్త ట్యాలెంట్ పట్టుకోవడం లో అయినా... ప్రతీ మూవీలోనూ ఫ్రెష్ లుక్ ఇవ్వాలన్నా... బన్నీ తర్వాతే ఎవరైతే. సినిమాకో స్టైలింగ్ తో అదరగొట్టేస్తుంటాడు. డ్యాన్స్ నుంచి ఫైట్స్ వరకూ అన్నిటిలోనూ ప్రయోగాలు చేసేస్తుంటాడు. అయితే అవన్నీ సినిమాతో పాటే వచ్చి వెళ్లిపోతుంటాయి. అందుకే ఆ ప్రయోగాలను మనం గుర్తించపోయినా.. తేడా మాత్రం ఖచ్చితం గా కనిపిస్తుంటుంది. ఇప్పుడు మన అల్లువారబ్బాయి నుంచి హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు జనాలు.
రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి.... రెండూ 50కోట్లకు పైగా వసూళ్లు సాధించడం తో... మంచి జోష్‌లో ఉన్నాడు అల్లు అర్జున్. ఈ ఊపులో నే నెక్స్ట్ మూవీ ని కూడా ఈ మార్క్ దాటించాల నే పట్టుదల తో... బోయపాటి తో కలిసి కష్టపడుతున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ... ఓ సెంటిమెంట్ మాత్రం ఈ సినిమా ని వెంటాడుతోంది, అనుమానాలు రేకెత్తిస్తోంది.
బోయపాటి డైరెక్షన్ అంటేనే యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధమవుతుంది. మరి అలాంటి సినిమా లో.. హీరోకి ధీటుగా విలన్ ఉండాలని భావించిన టీం... తమిళ హీరో ఆది పినిశెట్టి (వైశాలి హీరో)ని తెచ్చింది. ఇలా తమిళ హీరోని విలన్ చేయడం బన్నీకి ఇది రెండోసారి. మొదటిసారి వరుడులో హ్యాండ్సమ్ ఆర్యను తెచ్చి ఇలాగే ప్రయోగం చేశారు. అది కొట్టిన దెబ్బ నుంచి కోలుకోడాని కి బన్నీకి చాలానే టైం పట్టింది. ఇప్పుడు మళ్లీ ఇంకో తమిళ హీరోని విలన్ చేయడం తో... సెంటిమెంట్ తెరపైకొచ్చింది.
అయితే... సినిమా బాగుంటే సెంటిమెంట్స్ వర్కవుట్ కావనడానికి లేటెస్ట్ వండర్ బాహుబలి సాక్ష్యం. అదేనండీ తమన్నా ఉంటే మూవీ ఢామ్మని పేలుతుందనే టాక్. సో, మూవీలో స్టఫ్ ఉండేలా చూసుకుంటే... ఈసారి బోయపాటి, ఆదిల కాంబినేషన్ తో... బన్నీ సులభంగానే హ్యాట్రిక్ కొట్టేయచ్చు.