Begin typing your search above and press return to search.
అది ఎయిర్ పోర్టా? ఫుట్ బోర్డా?
By: Tupaki Desk | 12 Jan 2016 8:54 AM GMT సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల బస్సు స్టాండ్లు - రైల్వే స్టేషన్లు కిటకిటలాడిపోతాయి. ఈ ఏడాది వాటితో పాటు విమానాశ్రయాలు కూడా కిటకిటలాడిపోతున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ జనరల్ కంపార్టుమెంటులా కనిపిస్తోందట. ఆ దెబ్బకు సెలబ్రిటీలకు కూడా లైన్లోనే క్యూలో నిలబడటం తప్పేలా లేదు. మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కిక్కిరిసిపోయింది. హైదరాబాద్ సిటీ బస్సుల ఫుట్ బోర్డులా చీమ దూరేంత సందు లేకుండా కనిపించింది.
శంషాబాద్ లో పరిస్థితిపై తెలుగు హీరో ఆది తన ట్విట్టర్ లో ఫొటో పోస్ట్ చేశాడు హీరో ఆది. భారీ క్యూ లైన్ ల ముందు నిలబడి సెల్పీ దిగి దాన్ని ట్వీట్ చేశాడు. ఎయిర్ పోర్ట్ లో కూడా సంక్రాంతి మూడ్ అంటూ సరదాగా కామెంట్ చేశాడు.
ఇటీవల తండ్రిగా ప్రమోషన్ పొందిన ఆది ప్రస్తుతం తన తాజా చిత్రం 'గరం' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ ఏడాది తండ్రి సాయి కుమార్ తో కలిసి నటించడానికి ప్లాన్ చేసుకుంటున్న ఆయన సినిమా పనులపై వెళ్తున్నాడో.... అత్తారింటికి ప్రయాణమయ్యాడో తెలియదు కానీ శంషాబాద్ రద్దీలో మాత్రం బుక్కయిపోయాడు.