Begin typing your search above and press return to search.
కేజీయఫ్ సినిమాతో అంతా మారిపోయింది: ఆది సాయికుమార్
By: Tupaki Desk | 27 Dec 2022 4:30 PM GMTయంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్ సక్సెస్ లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన సినిమాలని ఎంచుకుంటూ ప్రేక్షకులని ఆకట్టుకుటున్నారు. ఆది సాయికుమార్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ `టాప్ గేర్`తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో కె.వి. శ్రీధర్ రెడ్డి నిర్మాణంలో ఆదిత్య మూవీస్ , ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఆది సాయికుమార్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం మీడియాతో హీరో ఆది సాయి కుమార్ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలివి.
ఒకే ఏడాది మూడు సినిమాలు వచ్చాయి.. దీనిపై మీ స్పందన ఏంటి?
కరోనా వల్ల అన్ని సినిమాలు ఆలస్యమయ్యాయి. అందుకే అన్నీ ఒకే సారి వస్తున్నాయి. ఇక సమ్మర్ సీజన్‌లో పెద్ద సినిమాలు రావడంతో డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. చిన్న సినిమాలకు ప్రస్తుతం డేట్స్ దొరకడం కష్టంగా మారింది. అందుకే ఈ ఏడాదిలో నా నుంచి మూడు చిత్రాలు వచ్చాయి.
టాప్ గేర్ సినిమా కథలో ఏ అంశం నచ్చింది? సినిమాను ఎందుకు ఎంచుకున్నారు?
టాప్ గేర్ కథ నాకు బాగా నచ్చింది. క్యాబ్ డ్రైవర్.. అతని జీవితంలో చిన్న సమస్య.. అది పెద్దగా మారడం.. ఒక్క రోజులో ఈ కథ జరుగుతుంది.. మా టీం అందరికీ ఈ కథ నచ్చింది. అందుకే ఈ సినిమాను చేశాం.
టాప్ గేర్ టైటిల్ ఆసక్తికరంగా ఉంది. ఈ ఆలోచన ఎవరిది?
టాప్ గేర్ అనే టైటిల్‌ను ముందుగా అనుకోలేదు. కానీ హీరో కారెక్టర్ మాత్రం టాప్ గేర్‌లోనే ఉంటుంది. హీరో టాప్ గేర్ వేయాల్సి వస్తుంది. ఒకసారి టాప్ గేర్ అని అనుకున్నాం. చాలా స్టైలిష్ గా ఉందని ఆ టైటిల్‌ను ఫిక్స్ చేశాం.
టాప్ గేర్ డైరెక్టర్‌తో పని చేయడం ఎలా అనిపించింది?
డైరెక్టర్ శశికాంత్ చూస్తే ఓ ప్రొఫెసర్‌లా ఉంటారు. కానీ చాలా క్లారిటీతో ఉంటాడు. సీనియర్ డీఓపీ సాయి శ్రీరామ్ కి కూడా ఆ షాట్ అలా తీద్దాం ఇలా తీద్దామని చెబుతుండేవాడు. చాలా క్లారిటీతో ఉండేవాడు. ఎడిటర్ ప్రవీణ్ పూడి సైతం కంటెంట్ చాలా బాగుందని, బాగా తీశారని అన్నాడు.
టాప్ గేర్ పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగుతుందా?
టాప్ గేర్ అనేది కంప్లీట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏమీ కాదు. ఓ కుర్రాడు తనకు సంబంధం లేని చిక్కుల్లో ఇరుక్కుంటే ఏం అవుతుంది.. దాన్నుంచి ఎలా బయటపడతాడు అనేది చూపిస్తాం. ఐడియా కొత్తగా ఉంటే నేను సినిమాలను ఎంచుకుంటాను. ఐడియా బాగుంటే సగం సినిమా హిట్ అయినట్టే. మిగతాది అంతా స్క్రీన్ ప్లేలో ఉంటుంది. అయినా జనాలకు ఇప్పుడు ఏది నచ్చుతుందనేది అంచనా వేయలేకపోతున్నాం.
పూర్తి మాస్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుతుంటారు. మరి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారా?
ఇప్పుడు మాస్ స్టోరీలంటే అర్థం మారింది. కేజీయఫ్ సినిమా వచ్చి అంతా మార్చేసింది. అలాంటి సినిమాలే ఇప్పుడు మాస్‌కు నచ్చుతున్నాయి. ఇప్పుడు చేస్తే అలాంటి సినిమానే చేస్తాను. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను చేయను.
టాప్ గేర్ సినిమాలో ఫైట్స్ కీలకంగా మారేలా ఉన్నాయి. ఫైట్ మాస్టర్ గురించి చెప్పండి?
రొమాంటిక్ సినిమాతో ఫైట్ మాస్టర్ పృథ్వీకి మంచి బ్రేక్ వచ్చింది. ఎంతో సహజంగా ఫైట్‌లను కంపోజ్ చేస్తుంటాడు. ఫైట్‌లో కూడా కథను చెప్పాలని చూస్తాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తెల్లవారుఝామున నాలుగు గంటలకు ఓ సీన్ చేశాం. ఆ టైంలో యాక్సిడెంట్ కూడా జరిగింది. ఈ సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ అంతా కూడా రాత్రే షూటింగ్ చేశాం.
టాప్ గేర్ సినిమాకు కారు కీలకంగా మారుతున్నట్టుంది?ప్రత్యేకంగా కారుని డిజైన్ చేశారా?
టాప్ గేర్ సినిమా అంతా కూడా కారులోనే ఉంటుంది. కాబట్టి మా ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ ఆ విషయంంలో కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా బాగా డిజైన్ చేశారు. ఇందులో నేను క్యాబ్ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాను. కానీ కథలో ఓ భాగంగానే ఆ పాత్ర ఉంటుంది.
ఈ సినిమాకు మ్యూజిక్, ఆర్ఆర్ ప్రాముఖ్యత ఎంత ఉంటుంది?
టాప్ గేర్ సినిమాకు ఆర్ఆర్ చాలా ముఖ్యం. హర్షవర్దన్ రామేశ్వర్ మాకు అద్భుతంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఆయన అంతకు ముందు ఆర్జున్ రెడ్డి చేశాడు. ప్రస్తుతం రవితేజ రావణాసుర, యానిమల్ సినిమాలు చేస్తున్నాడు. టాప్ గేర్ సినిమా బాగుందని ఆయన కూడా అన్నారు. సినిమాలో ఒకే ఒక్క పాట ఉంటుంది.
కొత్త కథలు, ప్రయోగాలు చేసేందుకు ఆసక్తిగానే ఉన్నారా?.. ప్రస్తుతం చేస్తున్న సినిమా సంగతులు ఏంటి?
కొత్త కథలు చేయాలని, ప్రయోగాలు చేయాలని ఉంటుంది. ప్రస్తుతం నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. జీ5 కోసం నేను చేయబోతున్న వెబ్ సిరీస్‌లో ఎవ్వరూ ఊహించనటువంటి పాత్రను పోషిస్తున్నాను. కానీ నా వద్దకు వచ్చే కథలన్నీ కమర్షియల్ యాంగిల్‌లోనే ఉంటాయి. కానీ నాకు రియలిస్టిక్ సినిమాలు చేయాలని ఉంటుంది.
నెగెటివ్ రోల్స్ ఏమైనా చేస్తారా? ఆ దిశగా ఏమైనా ఆఫర్లు వచ్చాయా?
నెగెటివ్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు హీరోగా మంచి చిత్రాలు చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ కూడా చకాచకా చిత్రాలు చేసేయాలని అనుకుంటున్నాను.
టాప్ గేర్ సినిమా ఎలా ఉండబోతోంది?
టాప్ గేర్ సినిమా టెక్నికల్‌గా బాగుంటుంది. మ్యూజిక్, కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటాయి.
భవిష్యత్ సినిమాల గురించి చెప్పండి?
నేను ప్రస్తుతం లక్కీ మీడియాకు ఓ సినిమా చేస్తున్నాను. జీ5 కోసం చేసిన వెబ్ సిరీస్ షూటింగ్ అయిపోయింది. వచ్చే నెలలో ప్రమోషన్స్ మొదలుపెడతారు. సినిమాకు తక్కువ కాకుండా ఉంటుంది. మొదటి సీజన్‌లో ఎనిమిది ఎపిసోడ్‌లు ఉంటాయి.
హీరోయిన్ రియాతో పని చేసిన అనుభవం ఎలా ఉంది?
రియాకు నాకు సీన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఆమె ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉన్నారు. నయనతార ప్రొడక్షన్ కంపెనీలో సినిమా చేస్తోంది. ఆమెతో పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో చక్కగా నటించింది.
టాప్ గేర్ సినిమాను ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారా?
టాప్ గేర్ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాం. హిందీలో డబ్ చేస్తున్నాం. గరం సినిమాతో నార్త్‌లో బాగానే క్రేజ్ వచ్చింది. లవ్ లీ, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ హిందీ ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకున్నాయి.
మీ మాస్ ఇమేజ్‌ను చూసి నిర్మాతలు ముందుకు వస్తున్నారా? కంటెంట్ చూసి వస్తుంటారా?
మంచి కంటెంట్ ఉంటేనే నిర్మాతలు ముందుకు వస్తారు. నా ప్రతీ సినిమా టెక్నికల్‌గా బాగా ఉంటుంది. నా చిత్రాలు ఓటీటీలోనూ బాగానే ఆడుతుంటాయి. కొన్ని పరిస్థితుల వల్ల థియేటర్లో సరిగ్గా ఆడలేదు. శశి సినిమాకు థియేటర్లో ఓపెనింగ్స్ వచ్చాయి. ఓటీటీలో బాగా ఆడింది. క్రేజీ ఫెల్లో సినిమా కూడా ఓటీటీలో బాగా ఆడింది.
మీ నాన్న గారి సినిమాలైనా, పాటల్లో ఏదైనా రీక్రియేట్ చేయాలని అనుకుంటున్నారా?
నాన్న గారి పాటను రీమేక్ చేయాలని ఉంది. 'అసలేం గుర్తుకురాదు' అనే పాటను రీమేక్ చేయాలని ఉంది. కానీ ఆ సిట్యువేషన్ పడాలి. అయితే ఆ సాంగ్‌ను రీక్రియేట్ చేస్తే మళ్లీ కృష్ణవంశీ గారే తీయాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.