Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆహా ఏమి అందం

By:  Tupaki Desk   |   31 May 2018 11:45 AM IST
ఫోటో స్టోరి: ఆహా ఏమి అందం
X
బాలీవుడ్ లో క్రేజ్ అందుకునే నటీమణుల్లో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ ని మెయింటైన్ చేస్తారు. అలాంటి వారిలో అహనా కుమ్ర టాప్ లో ఉందనే చెప్పాలి. అమ్మడు ఎక్కువగా షార్ట్ ఫిల్మ్స్ తోనే పాపులారిటీని సంపాదించుకుంది. కెరీర్ మొదటి నుంచి అహనా గ్లామర్ డోస్ పెంచుకుంటూ వస్తోంది. బాలీవుడ్ లో లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా అనే సినిమాలో అహనా కనిపించిన తీరు అందరిని ఆకట్టుకుంది. సీరియల్స్ లో కూడా నటించి ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ బ్యూటీ కొంచెం దగ్గరైంది.

అయితే ఎలాంటి సినిమాలు చేసినా అహనా తన గ్లామర్ షోతో ఎదో ఒక విధంగా కుర్రకారును తనవైపుకు తిట్టుకుంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే హాట్ ఫొటోలు ఏ విధంగా ఉంటాయో పైన కనిపిస్తున్న ఫొటో చుస్తే అర్ధమవుతుంది. అహనా కి విదేశాలు తిరగడమంటే చాలా ఇష్టం. ప్రతి ఆరు నెలలకోసారి ఈ నార్త్ బేబీ ప్లాన్స్ గట్టిగానే వేస్తుంది. ఇక రీసెంట్ గా టర్కీ వెళ్లిన ఈ బ్యూటీ అక్కడి బీచ్ లలో అలాగే రిసార్ట్స్ లలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది.

ఇప్పటివరకు ఇచ్చిన ఫొటో స్టిల్స్ కంటే ఇటీవల ఇచ్చిన లుక్ తో అహనా అందరిని స్టన్ అయ్యేలా చేసింది. బికినిలో సోయగాలను సరికొత్తగా ప్రజెంట్ చేస్తూ ఆహా ఏమి అందం అహనా.. అనేలా నెటిజన్స్ మనసు దోచుకుంటోంది. ఇక అహనా ప్రస్తుతం వెబ్ సిరీస్ లో అలాగే ఒక సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించనుంది.