Begin typing your search above and press return to search.
కింగ్ హీరోయిన్ పెళ్లయిన ఆంటీ?
By: Tupaki Desk | 20 Sep 2018 1:30 AM GMTచాలా కాలం తర్వాత ఒక అందమైన అమ్మాయి నా పక్కన హీరోయిన్ గా నటిస్తోంది! అంటూ ఉబ్బితబ్బిబ్బయ్యారు కింగ్ నాగార్జున. నిజమే .. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అంత అందమైన అమ్మాయినే వెతికి పట్టుకున్నారు. అనుష్క తర్వాత మళ్లీ అంత ఛామింగ్ గాళ్నే వెతికి తెచ్చారు. ఈ అమ్మడి పేరు ఆకాంక్ష సింగ్ అంటూ పరిచయం చేశారు. ఒడ్డు - పొడవు - నవ్వు గుబులు గుబులుగా చాలా బావున్నాయన్న టాక్ వినిపించింది. ఆకాంక్ష అదుర్స్ అంటూ యూత్ కితాబిచ్చేశారు. టబు - నగ్మ నుంచి అనుష్క - ఆకాంక్ష వరకూ కింగ్ సెలక్షనే వేరబ్బా! అంటూ ముక్కున వేలేసుకున్నారు. అంతగా కింగ్ ఏరికోరి ఎంచుకున్న ఈ అమ్మడి గతమేంటి? అని వెతికితే చాలానే ఆసక్తికర సంగతులు తెలిశాయి.
ఆకాంక్ష మ్యారీడ్ గాళ్. హబ్బీ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లి తర్వాత నటించడానికి ఆయనకేం అభ్యంతరం లేదు. ఆ సంగతిని తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలోనూ చెప్పింది. అంతే కాదు ఆకాంక్ష ఇదివరకూ అదే అక్కినేని కాంపౌండ్ లో సుమంత్ సరసన `మళ్లీ రావా` చిత్రంలో నటించింది. తర్వాత దేవదాస్ ఛాన్స్ పిలిచి మరీ ఇచ్చారు. ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆకాంక్ష.. పెళ్లి తర్వాత నటిస్తే తప్పేంటి? అని ప్రశ్నించింది. అంతేనా? పెళ్లి పెళ్లే.. నటన నటనే.. ట్యాలెంట్ ఉంటే దానికి దీనికి లంకె వేస్తారెండుకు? అయినా పాతకాలం భామ్మ గారి ఆలోచనలేంటి ఇంకా! అంటూ చెడామడా కడిగేసింది.
అదంతా సరే కానీ, ఈ భామ తాజాగా ఓ ఆంగ్ల పత్రిక చిట్ చాట్ లో కింగ్ ని స్కూలోకి ఎత్తేసిన తీరు ప్రస్తుతం చర్చకొచ్చింది. నాగార్జున సర్ సెట్స్ లో ఉంటే చాలు. పాజిటివ్ వైబ్స్ ఆటోమెటిగ్గా వచ్చేస్తాయి. ఆయనకు ఎంతో చరిత్ర ఉంది. కానీ ఇప్పటికీ అదే తీరుగా చిలౌట్ చేసేస్తారు సెట్స్ లో. ఆయన ఓ సజెషన్ ఇచ్చారు. సెట్ లో మరీ బిగ్గరగా డైలాగ్ చెప్పేయకు. డబ్బింగులో లిప్ సింక్ కుదరదు.. అని సూచించారు. వెంటనే దానిని అమల్లో పెట్టేశాను. థాంక్స్ టు నాగ్`` అని పొగిడేసింది. ఇక నాని గురించి చెబుతూ కెమెరా ముందు ఎలా కుదురుకోవాలో మంచి సలహాలు సూచనలు చేశారని, శ్రీరామ్ ఆదిత్య అల్ట్రా కూల్ మ్యాన్ అని చెప్పేసింది ఆకాంక్ష.