Begin typing your search above and press return to search.

ఆకాశమే నీ హద్దురా రీమేక్‌ హైకోర్టు తీర్పు

By:  Tupaki Desk   |   9 Sep 2021 9:30 AM GMT
ఆకాశమే నీ హద్దురా రీమేక్‌ హైకోర్టు తీర్పు
X
సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొంది గత ఏడాది డైరెక్ట్ ఓటీటీ విడుదల అయిన సూరారై పోట్రు ను హిందీలో రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యారు. తమిళంలో నిర్మించిన సూర్యనే హిందీలో కూడా నిర్మించాలని భావిస్తున్నాడు. ఇప్పటికే రీమేక్‌ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. నటీ నటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక దాదాపుగా పూర్తి అయ్యింది. షూటింగ్ ప్రారంభం అవ్వడమే తరువాయి అనుకుంటున్న సమయంలో కోర్టులో కేసు నమోదు అయ్యింది. సిఖ్యా ఎంటర్‌ టైన్మెంట్స్‌ సంస్థ కెప్టెన్‌ గోపీనాథ్‌ బయోపిక్ ఆధారంగా రచించిన హిందీ పుస్తకం సింప్లీఫై హక్కులు మా వద్ద ఉన్నాయి. కనుక హిందీలో సినిమాను చేయడానికి వీలు లేదు అంటే సిఖ్యా వారు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. గత కొన్ని రోజులుగా ఈ కేసు విచారణ జరిగింది. ఎట్టకేలకు ఈ కేసు విషయంలో హై కోర్టు తన తుది తీర్పును వెళ్లడించడం జరిగింది.

కెప్టెన్‌ గోపీనాథ్‌ పుస్తక హక్కులు మరియు సినిమా హక్కులు రెండు వేరు వేరు అంటూ సూర్య నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌ టైన్మెంట్ తరపున న్యాయవాదులు వాదించడం జరిగింది. దాంతో కోర్టు 2డీ ఎంటర్ టైన్మెంట్‌ కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో సూర్య మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రీమేక్ కు హైకోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో వెంటనే షూటింగ్‌ ను మొదలు పెట్టాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారు. ఆకాశమే నీ హద్దురా అంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కెప్టెన్‌ గోపీనాథ్‌ బయోపిక్ ఖచ్చితంగా హిందీ ఆడియన్స్ ను కూడా మెప్పిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఒక వైపు హిందీలో రీమేక్ కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే మరో వైపు తమిళంలో సూరారై పోట్రు కు సంబంధించిన సీక్వెల్‌ కు కథ రెడీ అవుతుంది అంటున్నారు. ఆకాశమే నీ హద్దు లో గోపీనాథ్‌ తక్కువ రేటుకు ఎలా విమాన ప్రయాణంను అందించాడు.. అయితే సీక్వెల్ లో ఆ ప్రయోగం ఎలా విఫలం అయ్యింది.. ఏ కారణాల వల్ల గోపీనాథ్‌ ఆ బిజినెస్ ను వదిలేయాల్సి వచ్చింది అనే విషయాలను చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ఒకే సారి సూరారై పోట్రు సినిమాకు రీమేక్ మరియు సీక్వెల్‌ తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిందీ రీమేక్ కాస్త ముందు ప్రారంభం అయినా సీక్వెల్‌ కు మాత్రం కాస్త సమయం పడుతుందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.