Begin typing your search above and press return to search.
నాకోసం హెల్మెట్ పెట్టుకో మెహబూబా
By: Tupaki Desk | 27 April 2018 10:10 AM GMTసినిమా ప్రమోషన్ ట్రైలర్లు టీజర్లు పోస్టర్లు... ఇలానే చేసుకోవాలా? కాస్త కొత్తగా ప్లాన్ చేస్తే అదిరిపోతుంది. మెహబూబా సినిమా యూనిట్ అదే చేసింది. ఒక పక్క సినిమా ప్రమోషన్ తో పాటూ సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని కూడా ఇచ్చింది. హెల్మెట్ పెట్టుకోవడం చాలా ముఖ్యమని చెబుతూ చిన్న షార్ట్ ఫిల్మ్ తీసింది. అది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు వారి సౌజన్యంతో వారి భాగస్వామ్యంతో.
పూరీ జగన్నాథ్ తాజా సినిమా మెహెబూబా. ఇందులో పూరీ కొడుకు ఆకాష్ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. 1971లో ఇండియా పాక్ బోర్డర్ లో జరిగే అందమైన ప్రేమకథ. ఈ సినిమా అతి త్వరలో విడుదల కానుంది. ఇదే సమయంలో ఆ సినిమా హీరో హీరోయిన్లనే పెట్టి ట్రాఫిక్ ఎవేర్ ఎస్ వీడియోను చిత్రీకరించారు. అందులో ఆకాష్‌ను కలిసేందుకు వచ్చిన నేహా తిరిగి తన బైక్ పై ఇంటికి బయలుదేరుతుంది. కానీ హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ కు తగిలిస్తుంది. అది చూసిన ఆకాష్ ఆమెను కదలనీయడు. హెల్మెట్ మన కోసం కాకపోయినా మనల్ని ప్రేమించేవాళ్లకోసమైనా పెట్టుకోవాలని ప్రేమతో చెబుతాడు. మై మెహబూబా ఈజ్ మై లైఫ్ అని చెబుతాడు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి ప్రమాదాల బారిన పడద్దని ఆ వీడియో సందేశం. అలాగే మెహబూబా సినిమా ప్రమోషన్ కూడా అయినట్టే. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న మాట.
మెహబూబా సినిమా మే 11న థియేటర్లలోకి రానుంది. దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు పూరీ. తనకు తన కొడుకుకు కూడా ఈ సినిమా టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని నమ్ముతున్నాడు. ఓ పాక్ అమ్మాయి ప్రేమలో పడిన భారతీయ సైనికుడు తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడన్నదే కధ. ఇప్పటికే ట్రైలర్ దుమ్మురేపింది.
వీడియో కోసం క్లిక్ చేయండి