Begin typing your search above and press return to search.
ప్రభాస్ వదిలిన 'ఆకాశవాణి' ట్రైలర్..!
By: Tupaki Desk | 20 Sep 2021 12:52 PM GMTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం''ఆకాశవాణి''. విలక్షణ నటుడు సముద్రఖని - వినయ్ వర్మ - తేజ కాకుమాను - ప్రశాంత్ - గెటప్ శీను ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ మొదటివారంలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల వాయిదా పడింది. అయితే ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ విడుదలకు వెళ్తున్నారు. సోనీ లివ్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో సెప్టెంబర్ 24 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
'ఆకాశవాణి' నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించి. స్ట్రీమింగ్ డేట్ దగ్గర పడుతుండటంతో తాజాగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ట్రైలర్ ను విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందజేశారు. 'మనం బతికినా సచ్చినా.. తిన్నా పస్తున్నా.. ఎవరి వల్ల.. దేవుడి వల్ల.. దొర వల్ల' అంటూ ఓ పెద్దాయన చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. కొండ ప్రాంతంలో నివసిస్తూ.. ఓ దొర కనుసన్నల్లో బ్రతుకుతున్న ఆదివాసీల జీవితాన్ని ఇందులో చూపించారు.
'గొర్రెలకు కొమ్ములు.. గూడేనికి దమ్ములు ఉండకూడదు' అని భయపెట్టే వ్యక్తుల నుంచి కాపాడమని ఆ దేవుడి మీద భారం వేసిన అమాయకపు ప్రజలను చూడొచ్చు. భూస్వామి అణచివేత మరియు మూఢ నమ్మకాల మధ్య చిక్కుకున్న గూడెంవాసులను కాపాడటానికి ప్రయత్నించే చంద్రం మాస్టార్ గా సముద్రఖని కనిపిస్తున్నారు. అయితే ఒక రేడియో వారి జీవితాల్లోకి ప్రవేశించి తర్వాత అన్ని విషయాలు మారిపోతాయని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. గూడెం ప్రజలకు ఆకాశవాణికి మధ్య కథేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఫెంటాస్టిక్ అండ్ ఫ్రెష్ విజువల్స్ మరియు అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ తో కూడిన 'ఆకాశవాణి' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కొత్త దర్శకుడు డైరెక్టర్ అశ్విన్ గంగరాజు తన తొలి సినిమాకి విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాశారు. కాల భైరవ సంగీతం సమకూర్చగా.. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఏయూ అండ్ ఐ (AU & I) స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఎ.పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.