Begin typing your search above and press return to search.

రానా తలబరువు తగ్గిస్తానంటున్నాడు!

By:  Tupaki Desk   |   29 Nov 2018 4:40 PM IST
రానా తలబరువు తగ్గిస్తానంటున్నాడు!
X
అప్పట్లో విక్రమ్ బాడీ ట్రాన్స్ ఫార్మేషన్ గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు తెలుగులో మన హీరోలు కూడా వెయిట్ పెంచడం.. తగ్గించడం లాంటివి అవలీలగా చేస్తున్నారు. అలాంటి వారిలో భల్లాలదేవుడిగా అందరినీ మెప్పించిన రానా దగ్గుబాటి ఒకరు. ఈమధ్య మళ్ళీ పూర్తిగా బక్క చిక్కి నారా బాబు అవతారంలోకి మారిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా ఈ రానా బాబు తన హెయిర్ స్టైల్ మార్చాడు. అలా మార్చడానికి సహాయం చేసింది ఎవరో కాదు.. సెలెబ్రిటీ స్టైలిష్ హకీమ్ ఆలిమ్. బియర్డ్ లుక్ లో ఉన్నరానా న్యూ హెయిర్ స్టైల్ ను తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన హకీమ్ ఇలా క్యాప్షన్ ఇచ్చాడు "అయన భుజాలపై ఎప్పుడూ చాలా బరువుంటుంది. అందుకే ఆయన తలమీద ఎక్కువ బరువు లేకుండా చూస్తూ నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను."

హెయిర్ తగ్గించినా బుర్రమీసాలు గుబురు గడ్డంతో రానా మళ్ళీ రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. మరి ఈ కొత్త లుక్ ఏ సినిమాకోసమనేది ఇంకా తెలియదుగానీ రానా లుక్ కు మాత్రం నెటిజనుల నుండి ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. ఏంటో ఈ రానా బాబు.. పట్టుమని నాలుగునెలలు కూడా ఒకే గెటప్ లో ఉండేలా లేడు!