Begin typing your search above and press return to search.

వామ్మో.. వంట చేస్తూ మందు తాగుతున్న సీనియర్ నటి..!

By:  Tupaki Desk   |   13 March 2021 9:30 AM GMT
వామ్మో.. వంట చేస్తూ మందు తాగుతున్న సీనియర్ నటి..!
X
సీనియర్ నటి ఆమని ఒకప్పుడు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. 'మిస్టర్ పెళ్లాం' 'జంబ లకిడి పంబా' 'శుభలగ్నం' 'మావిచిగురు' 'శుభసంకల్పం' 'ఘరానా బుల్లోడు' వంటి సినిమాలలో ఆమె అభినయం తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. పెళ్లి తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్న ఆమని.. తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఆమె కీలక పాత్ర పోషించిన ''చావు కబురు చల్లగా'' సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

యువ హీరో కార్తికేయ - లావణ్య త్రిపాఠి జంటగా నటించిన 'చావు కబురు చల్లగా' చిత్రాన్ని కొత్త దర్శకుడు పెగళ్ళపాటి కౌశిక్ తెరకెక్కిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌ పై బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో శవాలను తీసుకెళ్లే వ్యాన్ డ్రైవర్ అయిన బస్తీ బాలరాజు తల్లి పాత్రలో ఆమని నటిస్తోంది. హీరో పాత్రతోపాటు ఆమె రోల్ కూడా వైవిధ్యంగా ఉంటుందని టీజర్ - ట్రైలర్స్ తో అర్థం అయింది. వాటిల్లో 'ఎదవ నాయాలా.. శవాన్ని తోలుకుపోరా అంటే.. మొగుడు పోయిన దాన్ని కెలికొచ్చాడు' అంటూ హీరోను తిట్టిపొసే తీరు అలరించింది.

ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి బయటకు వచ్చిన ఓ ఫోటో ఇందులో ఆమని పాత్ర ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పింది. ఈ ఫోటోలో ఆమె ఓ వైపు వంట చేస్తూనే మరోవైపు మందు తాగుతూ కనిపించింది. ఇన్నాళ్లు ఆదర్శవంతమైన గృహిణి పాత్రలు, సాంప్రదాయమైన రోల్స్ లో నటిస్తూ వచ్చిన ఆమని.. ఇప్పుడు ఒక్కసారిగా చేతిలో మందు గ్లాస్ పట్టుకొని షాక్ ఇచ్చింది. మరి ఆమె ఎందుకు మందు తాగాల్సి వచ్చిందో.. అసలు ఆమె కథేంటో తెలియాలంటే 'చావు కబురు చల్లగా' సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.