Begin typing your search above and press return to search.
20 ఏళ్ల లగాన్ ఆస్కార్ పై అమీర్ కామెంట్!
By: Tupaki Desk | 15 Jun 2021 4:30 PM GMTమిస్టర్ పర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కథానాయకుడిగా అశుతోశ్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కిన లగాన్ సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రొఫెషనల్ బ్రిటీష్ క్రికెటర్లకు.. క్రికెట్ ఆట అంటే ఏంటో తెలియని గ్రామస్థులకి మధ్య జరిగిన క్రీడా పోరు నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించిన మూవీ ఇది. ఆంగ్లేయులపై భారతీయ విలేజర్ల క్లైమాక్స్ గేమ్ సన్నివేశం సినిమా గ్రాఫ్ ని అమాంతం పెంచుతుంది. ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది. సరిగ్గా ఈ సినిమా రిలీజ్ అయి నేటికి రెండు దశాబ్ధాలు పూర్తయింది. 2001 జూన్ 15న లగాన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
లగాన్ ఆస్కార్ బరిలోనూ నిలిచి తృటిలో అవార్డును మిస్సైంది. 2002 లో ఉత్తమ విదేశీ చిత్రంగా పోటీ బరిలో నిలిచి టాప్ -5 లో స్థానం దక్కించుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ సమయంలో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏక్ ప్రేమ్ కహానీ అప్పటికే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అదే సమయంలో లగాన్ రిలీజ్ మరో సంచలనంగా మారింది.
లగాన్ దాదాపు 25 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. 65 కోట్లకు పైగానే వసూళ్లను సాధించి బాలీవుడ్ ఖ్యాతిని పెంచింది. ఇక సినిమాకు ఆస్కార్ దక్కకపోయినప్పటికీ టాప్ 5 లో నిలవడంతో అమీర్ దాన్నే పెద్ద రివార్డుగా భావించారు. ఇది గొప్ప విజయం అంటూ అమీర్ ప్రకటించడం విశేషం.