Begin typing your search above and press return to search.

ఫిట్ నెస్ ట్రైన‌ర్ తో అమీర్ డాట‌ర్ ప్రేమ నెట్టింట వైర‌ల్!

By:  Tupaki Desk   |   23 Sep 2022 7:05 AM GMT
ఫిట్ నెస్ ట్రైన‌ర్ తో అమీర్ డాట‌ర్ ప్రేమ నెట్టింట వైర‌ల్!
X
బాలీవుడ్ న‌టుడు అమీర్ ఖాన్ కుమార్తె ఐరాఖాన్-ఫిట్ నెస్ ట్రైన‌ర్ నుపుర్ శిఖారే మ‌ధ్య ప్రేమాయ‌ణం సాగుతున్న‌ట్లు కొంత కాలంగా ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. జంట‌గా దిగిన ఫోటోలు.. ముంబై వీధుల్లో శికార్లు..విదేశీ యానాలు.. జంట‌గా వంటి స‌న్నివేశాల‌తో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని బాలీవుడ్ మీడియా గుప్పుమంది.

కానీ అధికారికంగా రిలేష‌న్ గురించి ఇంత వ‌ర‌కూ ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. మీడియాలో ఎన్ని ర‌కాల క‌థ‌నాలు వైర‌ల్ అయినా వాటిపై ఏనాడు నోరు మొద‌లేదు. తాజాగా వీట‌న్నింటికీ జంట పుల్ స్టాప్ పెట్టేసింది. ఇటీవ‌లే నుపుర్ విదేశాల‌కు సైకిల్ పోటీల‌కు వెళ్లగా అత‌నితో పాటు ఐరాఖాన్ వెళ్లింది. పోటీలు ముగిస‌న వెంట‌నే ఐరా వ‌ద్ద‌కు చేరుకుని ఆమెను హ‌త్తుకుని నుపుర్ ముద్దాడారు.

అంనంత‌రం మోకాలిపై కూర్చొని 'న‌న్ను పెళ్లి చేసుకుంటావా? అని ఉంగ‌రం తొడిగి ప్ర‌పోజ్ చేసాడు. దీంతో ఐరా న‌వ్వుతూ 'ఎస్' చెబుతుంది. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇంత వ‌ర‌కూ అన‌ధికారికంగా సాగిన ప్రేమ‌యాణం ఇక‌పై అధికారికంగా కొన‌సాగించ‌డానికి అన్ని ర‌కాలు అనుమ‌తులు తెచ్చేసుకున్నారు.

ఇక‌పై కామెంట్ల‌కి..మీడియా క‌థ‌నాల‌కు పుల్ స్టాప్ ప‌డిన‌ట్లే. ఈ వీడియో చూసిన నెటి జ‌నులు ప్రేమ ప‌క్షుల‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఇక బాలీవుడ్ సెల‌బ్రిటీలు రియా చ‌క్ర‌వ‌ర్తి..ఫాతిమా సానా షేక్..రోహ్మాన్ షాల్ త‌దిత‌రులు అభినంద‌న‌లు తెలియ‌జేసారు. నుపుర్ కొన్నేళ్ల‌గా అమీర్ ఖాన్ కి ఫిట్ నెస్ ట్రైన‌ర్ గా ఉన్నారు.

ఆ త‌ర్వాత ఐరాఖాన్ కి అత‌నే శిక్ష‌కుడిగ‌తా మార‌రు. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం మొద‌లైంది. అది పువ్వులా విక‌సించి ప్రేమ‌గా మారింది. రెండేళ్ల నుంచి ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. 2022 లో వాటికి ఈ జంట పుల్ స్టాప్ పెట్టింది.

మ‌రి ఈ జంట బంధాన్ని పెళ్లి పీట‌ల వ‌ర‌కూ తీసుకెళ్తారా? లేదా? అన్న‌ది చూడాలి. అమీర్ డాట‌ర్ ఐరాఖాన్ న‌టిగా ఇంకా తెరంగేట్రం చేయ‌లేదు. అతి త్వ‌ర‌లోనే ఆ కార్య‌క్ర‌మం ఉంటుంది. అటుపై ఐరాఖాన్ సెల‌బ్రిటీ లీగ్ లో అధికారికంగా చేరుతుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.