Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ - అమీర్ - ధనుష్.. శంకరాభరణం

By:  Tupaki Desk   |   19 Jun 2017 9:19 AM GMT
ఎన్టీఆర్ - అమీర్ - ధనుష్.. శంకరాభరణం
X
ఇప్పుడు అన్నీ ఇండస్ట్రిలలో స్టార్ హీరోలు కావచ్చు కొత్త నటి నటులు కావచ్చు వాళ్ళవాళ్ళ స్థాయిలో ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులును మంత్రముగ్ధులును చేస్తున్నారు. మన తెలుగులో గొప్ప దర్శకుడు కళాతపస్వీ కే విశ్వనాథ్ పేరు మీదుగా కొత్తగా ప్రారంబించిన శంకరాభరణం అవార్డ్స్ విజేతల లిస్టును సోమవారం విడుదల చేశారు. ఈ అవార్డ్స్ లో ఉత్తమ నటులుగా ఎన్టీఆర్ - ధనుష్ - అమీర్ ఖాన్ ను ఎంపిక చేశారు ఆ సంస్థ నిర్వాహకులు. ఈ స్టార్స్ నటన ప్రతిభకు గుర్తింపుగా మంగళవారం నాడు గౌరవం సన్మానము చేయనున్నారు.

శంకరాభరణం అవార్డ్స్ ను నటి తులసి నిర్వహిస్తోంది. ఈ అవార్డ్స్ ను మొత్తం ఐదూ భాషల నటులుకు ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశారు. ఇంకా ఆమె మాటలాడుతూ “దాదాసాహేబ్ ఫాల్కె అవార్డ్ గ్రహీత నా గురువు గారు విశ్వనాథ్ దేశం గర్వించే సినిమాలు తీయటంతో పాటు దేశ ఐఖ్యతకు నిదర్శనంగా నిలిచారు. అందుకే ఈ అవార్డ్స్ ను ఐదు భాషల్లో ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం'' అని తెలిపారు.'' ప్రతి సినిమాను ఒక కళాఖండం గా తీర్చిదిద్దిన దర్శకుడు. అతని సినీ భాష తో ఎల్లలను చెరిపి కళకు భాష, దేశం, ప్రాంతం అడ్డు కాదు రాదని చాటిచెప్పారు'' అని చెబుతూ, ఈ సారి తక్కువ సమయం ఉండటం వలన అన్ని విభాగాలకు లిస్ట్ తయారుచేసి ఇవ్వలేకపోయాం. వచ్చే ఏడాది నుంచి మాత్రం పక్క ప్లాన్ తో వస్తాము అని తెలియజేశారు.

హిందీ సినిమాలో అమీర్ ఖాన్(దంగల్) - అలీయా బట్ట్(ఉడతా పంజాబ్) ఉత్తమ నటులుగా ఎంపిక చేయడం జరిగింది. తెలుగులో ఎన్టీఆర్ ను ‘జనతా గ్యారేజ్’ సినిమాకు గాను ఉత్తమ నటుడుగా ఎంపిక చేయడం జరిగింది. ‘పా పాండి’ సినిమాకు గాను ఉత్తమ డైరెక్టర్ గా ధనుష్ ను ఎంపిక చేశారు. మలయాళం సినిమా ‘ఓరు వడక్కన్ సెల్ఫి’ సినిమాకు గాను దుల్కర్ సల్మాన్ ను ఉత్తమ నటుడుగా ఎంపిక చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/