Begin typing your search above and press return to search.
ఇక నుంచి నేనూ సాయిపల్లవి ఫ్యాన్ నే: ఆమిర్ ఖాన్
By: Tupaki Desk | 20 Sep 2021 6:32 AM GMTతెలుగులో ప్రేమకథలను అందంగా .. అద్భుతంగా ఆవిష్కరించే దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన ప్రేమకథలో ఉన్నతమైన వ్యక్తిత్వాలు .. సున్నితమైన భావోద్వేగాలు ఉంటాయి. అందువలన యూత్ తో పాటు ఆయన సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. అలాంటి శేఖర్ కమ్ముల తాజా చిత్రంగా రూపొందిన 'లవ్ స్టోరీ' .. ఈ నెల 24వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆమిర్ ఖాన్ ముఖ్య అతిథిగా వచ్చారు.
ఈ వేదికపై ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ .. "ఈ రోజున ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. అందుకే వెంటనే నాగచైతన్యకి మెసేజ్ పెట్టాను. ఈవెంట్ కి రావొచ్చా అని అడిగాను .. దాంతో దర్శక నిర్మాతలు నన్ను బలవంతంగా పిలవాల్సి వచ్చింది. నేను ఇంతవరకూ సాయిపల్లవి సినిమాలు చూడలేదు. అందుకు నన్ను ఆమె క్షమించాలి. రీసెంట్ గా ఈ సినిమా క్లిప్పింగ్స్ చూశాను. అప్పటి నుంచి నేను కూడా సాయిపల్లవి ఫ్యాన్ ను అయిపోయాను. ఈ సినిమాను నేను రిలీజ్ రోజునే చూస్తాను. మహారాష్ట్రలో థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. అయినా ప్రైవేట్ స్క్రీనింగ్ కోసం పర్మిషన్ తీసుకుని చూస్తాను.
నేను ఇక్కడికి రావడానికి మరో ముఖ్యమైన కారణం ఉంది. 'లాల్ సింగ్ చద్దా' సినిమా షూటింగులో నేను నాగచైతన్యను చూశాను. ఒక కొత్త వ్యక్తితో పరిచయమైందని అనుకున్నాను. ఆ తరువాత ఎంతోకాలంగా మా మధ్య సాన్నిహిత్యం ఉన్నట్టుగా అనిపించింది. అందుకు కారణం ఆయన వ్యక్తిత్వం. ఆయన నటన .. మంచితనం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన మంచి నటుడే కాదు .. మంచి మనసున్న మనిషి. ఇంతమంచి లక్షణాలు ఉన్న నాగచైతన్యను నాకు పరిచయం చేసిన ఆయన పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పడానికే వచ్చాను .. ఆ విషయాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను.
ఇక శేఖర్ కమ్ముల గారి గురించి అంతా మాట్లాడుతుంటే, ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ అనే విషయం నాకు అర్థమైంది. ఆయన పట్ల ఇక్కడికి వచ్చిన వాళ్లంతా చూపుతున్న ప్రేమానురాగాలు చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతోంది. నేను ఇక్కడికి రాకపోతే ఒక మంచి దర్శకుడిని కలుసుకునే అవకాశాన్ని కోల్పోయేవాడిని. ఆయనను కలుసుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఒక మంచి చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు .. అందుకోసం కష్టపడిన టీమ్ కి శుభాకాంక్షలు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.