Begin typing your search above and press return to search.
విజయ్ సేతుపతి ఎందుకు తప్పుకున్నాడంటే ..?!
By: Tupaki Desk | 10 Aug 2022 12:30 AM GMTవిజయ్ సేతుపతి .. కోలీవుడ్ లో ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సాధారణంగా ఒకే భాషలో .. ఒకే సమయంలో అటు హీరోగా .. ఇటు విలన్ గా చేయడానికి ఏ ఆర్టిస్ట్ కూడా సాహసించడు. కానీ ఆ పనిని విజయ్ సేతుపతి ధైర్యంగా చేశాడు .. చేస్తున్నాడు. కథ .. పాత్ర తనకి నచ్చితే అందుకు తగినట్టుగా తెరపై కనిపించడానికి ఎంతమాత్రం ఆయన ఆలోచన చేయడు. రీసెంట్ గా వచ్చిన 'విక్రమ్' సినిమాను కూడా అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో ఆయన వాకింగ్ స్టైల్ ను ప్రేక్షకులు మరిచిపోలేదు.
అలాంటి విజయ్ సేతుపతితో కలిసి నటించడానికి స్టార్ హీరోయిన్స్ పోటీపడుతుంటారు. ఇక బాలీవుడ్ మేకర్స్ కూడా తమ సినిమాలో ఒక పాత్రకు ఆయనను తీసుకుంటే సౌత్ లో మంచి మైలేజ్ ఉంటుందనే స్థాయికి వచ్చేశారు.
అలా తన సొంత సినిమా అయిన 'లాల్ సింగ్ చడ్డా' కోసం ఆమిర్ ఖాన్ .. విజయ్ సేతుపతిని పిలిపించుకుని మరీ మాట్లాడారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ఆయనను తీసుకున్నారు. కానీ ఆ తరువాత ఆ పాత్ర కోసం చైతూను రంగంలోకి దింపారు. ఈ నెల 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో చైతూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ముందుగా విజయ్ సేతుపతిని అనుకుని .. ఆ తరువాత ఆయనతో ఎందుకు చేయించలేదనే ప్రశ్న చైతూకు ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "ఈ ప్రాజెక్టు నుంచి విజయ్ సేతుపతి ఎందుకు తప్పుకున్నాడనేది నిజంగా నాకు తెలియదు. డేట్స్ సర్దుబాటు చేయడం కుదరక పోవడం వల్లనే ఆయన తప్పుకున్నాడని నాకు చెప్పారు. ముందుగా ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగానే కథను రాసుకున్నారు. నేను ఎంటరైన తరువాత నా బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా మార్పులు చేశారు" అని చెప్పుకొచ్చాడు.
ఆమిర్ ఖాన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో .. చైతూ .. కరీనా ముఖ్యమైన పాత్రలను పోషించారు. అతుల్ కులకర్ణి స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి, అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ఆమిర్ ఉన్నాడు .. చైతూ కూడా అదే ఆశతో ఉన్నాడు. అయితే ఆ మరుసటి రోజైన 12వ తేదీన 'మాచర్ల నియోజక వర్గం' .. 13వ తేదీన 'కార్తికేయ 2' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మంచి బజ్ ఉన్న ఈ రెండు సినిమాల పోటీని 'లాల్ సింగ్ చడ్డా' ఎంతవరకూ తట్టుకుంటాడో చూడాలి మరి.