Begin typing your search above and press return to search.

నాకెందుకు సిగ్గు అన్న అమీర్ ఖాన్

By:  Tupaki Desk   |   2 Feb 2018 1:43 PM GMT
నాకెందుకు సిగ్గు అన్న అమీర్ ఖాన్
X
ఫిబ్రవరి 9న రానున్న అక్షయ్ కుమార్ ప్యాడ్ మ్యాన్ కోసం బాలీవుడ్ వర్గాలతో తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమ్మాయిల సానిటరీ న్యాప్కిన్స్ ని అతి తక్కువ ధరలో రూపొందించి గ్రామీణ మహిళల ఇబ్బందులు తొలగించి అపారమైన పేరు తెచ్చుకున్న అరుణాచలం మురుగనాధం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ప్యాడ్ మ్యాన్ ఇప్పటి దాకా బాలీవుడ్ లో ఏ స్టార్ హీరో చేయని సెన్సిటివ్ సబ్జెక్టుతో రూపొందుతోంది. ప్రమోషన్ లో భాగంగా యూనిట్ చాలా వినూత్నంగా ప్రచారం చేస్తోంది. ప్యాడ్ మ్యాన్ ఛాలెంజ్ పేరుతో రూపొందిన ఈ క్యాంపైన్ లో సెలెబ్రిటీలు నాప్కిన్ ప్యాడ్ ని చేతులో సాగదీసి పట్టుకుని ఇలాగే చేయమని మరికొందరికి ఛాలెంజ్ విసరాలి. అమీర్ ఖాన్ కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నాడు.

ఇందులో సిగ్గుపడడానికి ఏమి లేదని - ఇలా చేయటం చాలా సంతోషంగా ఉందని - ఒక చక్కని సినిమా-మంచి ప్రయోజనం కలిగించే ఇటువంటి పని చేయటం కోసం అందరూ ముందుకు రావాలని పిలుపు ఇచ్చాడు. అంతే కాదు తన వైపు నుంచి సల్మాన్ ఖాన్ - అమితాబ్ బచ్చన్ - షారుఖ్ ఖాన్ లకు కూడా సవాల్ విసిరేసాడు. ఈ మధ్యకాలంలో ఋతుస్రావం అదే పీరియడ్స్ గురించి అవగాహన పెంచేందుకు స్వచ్చంద సంస్థలు నడుం బిగించాయి. స్టార్ హీరోలు సైతం ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ అవుతోంది. ప్యాడ్ మ్యాన్ సినిమా దీనికి బాగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నారు.

అక్షయ్ కుమార్ హీరోగా బాల్కీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో అతనికి భార్యగా రాధికా ఆప్టే నటిస్తుండగా, ఈ ప్యాడ్స్ ని ఊరూరా తీసుకెళ్ళి ప్రచారం చేసే పనిలో సహాయం చేసే సోషల్ వర్కర్ గా సోనం కపూర్ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. తెలుగులో డబ్ చేయట్లేదు కాని ఇక్కడ కూడా బజ్ బాగానే ఉంది. హింది అయారితో పాటు తెలుగు సినిమాలు ఇంటెలిజెంట్ - గాయత్రిలతో ప్యాడ్ మ్యాన్ కు తెలుగు రాష్ట్రాల్లో పోటీ ఉంటుంది.