Begin typing your search above and press return to search.

నా ఫ్లాప్‌ కోసం ఎదురు చూశారు

By:  Tupaki Desk   |   30 Jan 2019 12:35 PM GMT
నా ఫ్లాప్‌ కోసం ఎదురు చూశారు
X
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ దాదాపు దశాబ్ద కాలం తర్వాత థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌ చిత్రంతో పరాజయం పాలయ్యాడు. లగాన్‌ నుండి మొదలైన అమీర్‌ ఖాన్‌ జైత్ర యాత్ర అద్వితీయంగా సాగింది. సినిమా సినిమాకు తన మార్కెట్‌ ను పెంచుకుంటూ వచ్చిన అమీర్‌ ఖాన్‌ థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాడు. అమితాబచ్చన్‌ వంటి మెగాస్టార్‌ ఈ చిత్రంలో నటించినా కూడా ఏమాత్రం ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆధరించలేదు. సినిమాలో స్టార్‌ కాస్టింగ్‌ ఉన్నంత మాత్రాన సక్సెస్‌ అవ్వదని మరో సారి నిరూపితం అయ్యింది.

థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ చిత్రం ఫ్లాప్‌ తర్వాత చాలా కాలం మీడియా ముందుకు రాలేదు. ఎట్టకేలకు మీడియా ముందుక వచ్చిన అమీర్‌ ఖాన్‌ తాజాగా పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. వరుస విజయాల తర్వాత తాను నటించిన సినిమా ఫ్లాప్‌ అవ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా సంవత్సరాల నుండి తనకు ఫ్లాప్స్‌ లేవని, అందుకే జనాలు నేను ఎప్పుడెప్పుడు ఫ్లాప్‌ మూవీ చేస్తానా అంటూ ఎదురు చూశారు. ఫ్లాప్‌ మూవీ చేయగానే ప్రేక్షకులు ప్రతీకారం తీర్చుకున్నారని పేర్కొన్నాడు. సినిమా ఫలితంను ప్రేక్షకులు నిర్మొహమాటంగా చెప్పే హక్కు ఉంది.

థగ్స్‌ విషయంలో ప్రేక్షకులు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తానని, ఫ్లాప్‌ ను నేను ఎప్పుడు కూడా దర్శకుడిపై నెట్టనని, సినిమా ఫ్లాప్‌ కు నేను కూడా ఒక కారణం అంటూ అమీర్‌ ఖాన్‌ హుందాగా స్పందించాడు. చేసే ప్రతి సినిమా ఆడుతుందని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తీస్తాం. కాని కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతాయని అమీర్‌ ఖాన్‌ అన్నాడు. సినిమా ఫ్లాప్‌ అయినంత మాత్రాన దిగులు పడాల్సిన అవసరం లేదని అమీర్‌ అన్నాడు. తన కొత్త సినిమాను రెండు నెలల్లో ప్రకటిస్తానంటూ కూడా అమీర్‌ క్లారిటీ ఇచ్చాడు.