Begin typing your search above and press return to search.
అమీర్ వల్ల థగ్స్ కు మరింత నష్టం
By: Tupaki Desk | 21 Nov 2018 5:15 PM GMTసినిమా ఎంత రిచ్ గా తీసినా - ఎంత కష్టపడి చేసినా కూడా పబ్లిసిటీ అనేది చాలా కీలకం అనే విషయం తెల్సిందే. పబ్లిసిటీతోనే గతంలో కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఒక మోస్తరు వసూళ్లను రాబట్టాయి అనే విషయం మనకు తెల్సిందే. ప్రతి సినిమాకు ప్రమోషన్ అనేది చాలా కీలకం. సినిమా ఫ్లాప్ టాక్ రాగానే పబ్లిసిటీ చేయకుండా వదిలేయరు. సినిమాకు మినిమం కలెక్షన్స్ అయినా రావాలనే ఉద్దేశ్యంతో ఇంకాస్త ఎక్కువ పబ్లిసిటీ చేస్తారు. కాని అమీర్ ఖాన్ మాత్రం తన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో ప్రమోషన్ కు మొహం చాటేస్తున్నాడు.
అమీర్ ఖాన్ ఈమద్య కాలంలో ఇంతటి భారీ డిజాస్టర్ ను చూడలేదు. ఆ కారణం వల్లే బాగా ఫీల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. సినిమా విడుదలై డిజాస్టర్ టాక్ రావడంతో వెంటనే విదేశాలకు వెళ్లి పోయాడు. సినిమా ప్రమోషన్ గురించి పట్టించుకోకుండా నిర్మాణ సంస్థ విజ్ఞప్తిని వినిపించుకోకుండా విదేశాలకు వెళ్లి పోయాడు. ఇక అమీర్ ఖాన్ సినిమాలకు చైనాలో మంచి డిమాండ్ ఉంటుందనే విషయం తెల్సిందే. అందుకే ఈ చిత్రాన్ని కూడా అక్కడ భారీ ఎత్తున విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కాని సినిమా ఫ్లాప్ అవ్వడంతో అమీర్ ఖాన్ అక్కడ విడుదల చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.
చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ వారు మాత్రం చైనాలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చైనాలో రెండు లేదా మూడు రోజులు పర్యటించి ప్రచారం చేసేందుకు రావాల్సిందిగా అమీర్ ఖాన్ ను నిర్మాణ సంస్థ కోరుతుండగా, అందుకు ఆయన ఆసక్తి చూపడం లేదట. చైనాలో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అమీర్ ఖాన్ హ్యాండ్ ఇవ్వడంతో ఏం చేయాలో అర్థం కాక నిర్మాతలు ఉన్నారు. చైనాలో విడుదలైతే ఈ చిత్రం భారీ నష్టాలను కొంతలో కొంత అయినా తగ్గించుకోవచ్చు అనేది యాష్ రాజ్ సంస్థ వారి అభిప్రాయం. కాని అమీర్ ఖాన్ తీరు వల్ల వారి నష్టాలు మరింతగా పెరుగుతున్నాయి.