Begin typing your search above and press return to search.
ఆ సిక్స్ ప్యాక్.. స్టెరాయిడ్లతో కాదు
By: Tupaki Desk | 11 Dec 2016 5:26 PM GMTకొంచెం కండలు తిరిగిన.. ఫిట్ గా ఉన్న బాడీతో సిక్స్ ప్యాక్ చేయడంలో ఉన్న కష్టం వేరు. అలా కాకుండా పెద్ద పొట్టేసుకుని భారీగా బరువు పెరిగిపోయిన వ్యక్తి సిక్స్ ప్యాక్ చేయడం వేరు. సినిమాకు సంబంధించి ఏం చేసినా మిగతా వాళ్లకంటే భిన్నంగా ఉండేలా చూసుకునే ఆమిర్ ఖాన్.. ‘దంగల్’ సినిమా కోసం రెండుసార్లు ఎలా తన అవతారాన్ని మార్చుకున్నాడో తెలిసిందే. ముందు బాగా లావుగా తయారయ్యాడు. 100 కిలోలకు చేరువయ్యాడు. పెద్ద పొట్టతో కనిపించాడు. ఆ తర్వాత ఆరు నెలలు కష్టపడి కళ్లు చెదిరే రీతిలో సిక్స్ ప్యాక్ బాడీ పెంచాడు. ఇలా చేయడం తనకు మాత్రమే సాధ్యం అనిపించాడు.
ఆమిర్ కష్టానికి సంబంధించిన వీడియో్ హాట్ టాపిక్ అయింది కూడా. ఐతే స్టెరాయిడ్లు వాడితే తప్ప ఇలాంటి బాడీ సాధ్యం కాదంటూ రణ్వీర్ అల్లబడియా అనే సర్టిఫైడ్ ట్రైనర్ ఆరోపణలు చేయడంతో అందరి దృష్టీ అటు మళ్లింది. దీనిపై ఆమిర్ కు ట్రైనర్ గా వ్యవహరించిన రాహుల్ భట్ స్పందించాడు. ఆమిర్ స్టెరాయిడ్లు వాడే సమస్యే లేదన్నాడు. సిక్స్ ప్యాక్ కోసం ఆమిర్ ఎంతగా కష్టపడింది పాయింట్ల వారీగా వివరించాడు. కఠోరమైన శ్రమ.. క్రమశిక్షణ.. మంచి ఫుడ్ తీసుకుంటే ఇలా బాడీని మార్చుకోవడం కష్టమేమీ కాదన్నాడు. తన వివరణతో ఒక వీడియో రూపొందించి దాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. మరి దీనిపై రణ్వీర్ ఏమంటాడో చూడాలి.