Begin typing your search above and press return to search.

అమీర్ డాట‌ర్ నెవ్వ‌ర్ బిఫోర్ లుక్

By:  Tupaki Desk   |   11 Feb 2020 4:30 AM GMT
అమీర్ డాట‌ర్ నెవ్వ‌ర్ బిఫోర్ లుక్
X
కసితో కుతకుత ఉడికే కళ్ళకి విందిదిగో.. ఎదలో కితకిత పెట్టే కన్నెల చిందిదిగో ..చెక్కిలి నొక్కుల చెక్కులలో చిక్కని మక్కువ చిక్కునురో.. చక్కిలిగింతల తొక్కిడిలో ఉక్కిరిబిక్కిరి తప్పదురో.. అక్కర తీర్చే అంగడిలో అద్దాల అందాలు అందాలి కదరా ... ఓ సినీక‌వి క‌వితాత్మ‌క వ‌ర్ణ‌న‌ ఇది.

`మిస్ట‌ర్ పెర్ఫెక్ట్` అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తన బాలీవుడ్ అరంగేట్రానికి ముందే సోషల్ మీడియాలో చెల‌రేగుతున్న తీరుకు క‌విత‌లు అల్లాల్సిందే. ఇరా క‌థానాయిక‌గా రంగ‌ ప్రవేశంపై స్ప‌ష్ట‌త ఏదీ లేదు కానీ.. ద‌ర్శ‌కురాలిగా తొలి ప్ర‌య‌త్న‌మే మెప్పు పొందింది. `యూరిపెడెస్ మెడియా` అనే నాటకానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించి పాపా అమీర్ నుంచి ప్ర‌శంస అందుకుంది. సోషల్ మీడియాలో ఈ నాటకాన్ని ప్ర‌మోష‌న్ చేసిన‌ప్పుడు ఇరా ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. నేను దీనిపై నెలల తరబడి శ్ర‌మించిన ప్రాజెక్ట్ స‌క్సెసైనందుకు ఆనందంగా ఉంద‌ని ఇరా తెలిపింది.

ఇక ఇరా గ‌త కొంత‌కాలంగా ర‌క‌ర‌కాల ఫోటోషూట్ల‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఫోటోల‌కు అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌స్తోంది. స్టార్ కిడ్ హ‌ద్దు మీరి ఎక్స్ పోజ్ చేస్తూ నెటిజ‌నుల్ని త‌న‌వైపు ఆకర్షిస్తోంది. తన స్నేహితురాలితో క‌లిసి కవల ఫోటోషూట్ల‌తో హైలైట్ అవుతోంది. తాజాగా త‌న స్నేహితురాలి బ‌ర్త్ డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు చెబుతూ.. నేను నిన్ను మిస్ అవుతున్నాను! నా ల్యాండ్‌లైన్‌లో రోజుకు 8 గంటలు నీతో మాట్లాడేదానిని.. నీకోస‌మే వేచి చూస్తాను! అంటూ ఎమోష‌న్ క‌న‌బ‌రిచింది.