Begin typing your search above and press return to search.
పీకే తెరవెనుక ఏం జరిగింది?
By: Tupaki Desk | 20 Jan 2015 6:44 AM GMTగత ఏడాది డిసెంబరు 19న భారతీయ వెండితెరపై ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. పీకే విడుదలైంది. ఇప్పటిదాకా ఏ భారతీయ సినిమాకూ రానన్ని ప్రశంసలు, వసూళ్లు ఈ సినిమా సొంతమయ్యాయి. ఇలాంటి సినిమా భారతీయ తెరపై నభూతో అన్నారు. కలెక్షన్ల పరంగానూ ఆ విషయం రుజువైంది. ఓ ఇండియన్ మూవీ తొలిసారి రూ.600 కోట్ల క్లబ్‌లో చేరింది. వివాదాల మాటెలా ఉన్నా.. చూసిన ప్రతి ప్రేక్షకుడిలోనూ ఆలోచన రేపిందీ సినిమా. ఇంత గొప్ప సినిమా తీయడానికి దర్శకుడు రాజ్‌కుమార్ హిరాని, కథానాయకుడు అమీర్ ఖాన్ ఎంత శ్రమించి ఉంటారో.. ఎంతగా బుర్రకు పని పెట్టి ఉంటారో ఊహించగలం. ప్రతి చిన్న విషయంలోనూ వీరు తీసుకున్న శ్రద్దకు సంబంధించి కొన్ని తెర వెనుక విషయాలు ఇప్పుడు వెల్లడయ్యాయి. అవేంటో చూద్దాం పదండి.
సినిమాలో అమీర్ గెటప్పుకు సంబంధించి ప్రతి విషయంపైనా శ్రద్ద పెట్టారు. పీకే హెయిర్ స్టయిల్ డిఫరెంట్‌గా ఉండాలన్న ఉద్దేశంతో అమీర్ తలకు హెయిర్ జెల్ రాసి చూశారు. కానీ అది అంత బాగా అనిపించలేదు. ఆ తర్వాత స్పైక్ హెయిర్ స్టయిల్ ట్రై చేశారు. అది కూడా నప్పలేదనిపించింది. తర్వాత జుట్టుని బంగారు రంగులోకి మార్చారు. అది కూడా సహజంగా లేదనిపించి చివరికి అమీర్ ఒరిజనల్ హెయిర్ స్టయిల్‌నే కొంచెం మార్చి అలాగే ఉంచేశారు. ఇక అమీర్ చెవులు, కళ్ల విషయంలోనూ చాలా కసరత్తే జరిగింది. చెవులు పెద్దగా కనిపించడం కోసం అమీర్ స్పాంజ్ తరహాలో ఉండే బ్లూ టాక్ వాడారు. దీని వల్లే చెవులు సాసర్ లా కనిపించాయి. కళ్లకేమో ఆకుపచ్చ రంగు లెన్సు వాడారు. నోరు ఎప్పుడూ ఎర్రగా కనిపించేందుకు వందదల కొద్దీ పాన్‌లు తిన్నాడు అమీర్. ఇందుకోసం ఓ పాన్ వాలానే పెట్టుకున్నారు. అమీర్ దుస్తుల కోసం ఇద్దరు ప్రముఖ డిజైనర్లను నియమించారు. వీళ్లిద్దరూ రాజస్థాన్ వీధుల్లో ఫుట్ పాత్ మీద అమీర్ కోసం దుస్తులు కొన్నారు. కొన్ని చొక్కాలు స్థానికులు వాడుతున్నవి చూసి.. నచ్చి కొన్నారు. ఇలా పీకే క్యారెక్టరు విషయంలో తెర వెనుక చాలానే శ్రమించారు. ఆ కష్టానికి మంచి ఫలితమే దక్కింది.