Begin typing your search above and press return to search.

ప్రభాస్ ను చూసి అమీర్ భయపడుతున్నాడా?

By:  Tupaki Desk   |   17 Feb 2016 10:19 AM GMT
ప్రభాస్ ను చూసి అమీర్ భయపడుతున్నాడా?
X
బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ స్థాయికి పెరిగిపోయింది. దీంతో ప్రభాస్ సినిమా రిలీజవుతుందంటే బాలీవుడ్ స్టార్లు కూడా భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బాహుబలి-2 సినిమా రిలీజ్ కు సమయం ఆసన్నమవుతుండడంతో ఆ సమయంలో తమ సినిమాలు రిలీజ్ కాకుండా చూసుకోవడమే బెటరని పలువురు బాలీవుడ్ హీరోలు అనుకుంటున్నారట.

ఇండియాలో బాలీవుడ్ అతిపెద్ద మార్కెట్ కాగా... బాలీవుడ్ టాప్ స్టార్లలో అమీర్ ఖాన్ ఒకరు. అమీర్ సినిమా వస్తుందంటే మిగతావాళ్లంతా భయపడతారు. అలాంటిది ఈసారి అమీర్ ఖానే భయపడుతున్నట్లు టాక్. అమీర్ నటించిన దంగాల్ ఈ డిసెంబరులో విడుదల కానుంది. బాహుబలి-2 కూడా ఇంచుమించు అదే సమయంలో విడుదలవుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది అమీర్ ను హెచ్చరిస్తున్నారట.... అమీర్ కూడా ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

అయితే... బాలీవుడ్ సినిమాల్లా తెలుగు సినిమాలు చెప్పిన తేదీకి విడుదల కావు. కాబట్టి డిసెంబరులో దంగాల్ విడుదలయినా ఆ సమయానికి బాహుబలి-2 విడుదలవుతుందా అన్నది అనుమానమే. కాబట్టి అమీర్ భయపడనవసరం లేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.