Begin typing your search above and press return to search.

భారీ బందోబ‌స్తు నడుమ స్టార్‌ హీరో

By:  Tupaki Desk   |   27 Nov 2015 5:10 AM GMT
భారీ బందోబ‌స్తు నడుమ స్టార్‌ హీరో
X
మిస్ట‌ర్ పెర్‌ ఫెక్ట్ అమీర్‌ ఖాన్ మొన్న‌టికి మొన్న ఇండియాలో ఉండ‌డం క‌ష్టం.. ఇన్‌ టోల‌రెన్స్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య చేసి అడ్డంగా బుక్క‌యిపోయాడు. దేశ‌వ్యాప్తంగా అత‌డి వ్యాఖ్య‌ల‌పై జ‌నాలంతా సీరియ‌స్ అయ్యారు. ఫ‌లితం సామాజిక వెబ్ సైట్ల‌లో అత‌డిపై బాంబ్ దాడి చేసినంత ప‌నే చేశారు. కోట్లాది రూపాయ‌ల డీల్స్ స్థంబించేలా అత‌డు బ్రాండ్ ప‌బ్లిసిటీ చేసే సంస్థ‌లన్నిటికీ పంచ్ ప‌డింది. ఎవ‌రేమ‌న్నా ఇది హిందూ దేశ‌మే అన్న అర్థం వ‌చ్చేలా మాట్లాడినందుకు ప్ర‌తిఫ‌ల‌మిది.

కార‌ణం ఏదైనా అమీర్‌ కి వారం పాటు థ్రెట్ త‌ప్ప‌ద‌ని భావించిన ముంబై పోలీసులు అత‌డి ఇంటిముందు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. దాదాపు డ‌జ‌ను మంది పోలీసులుల ఇంటిచుట్టూ ప‌హారా తిరుగుతున్నారు. ఏ క్ష‌ణం ఎట్నుంచి ఎలాంటి ముప్పు పొంచి ఉందో చెప్ప‌లేం. నా సంగ‌తిని ఈ బందోబ‌స్తు చెబుతోంది. జ‌స్ట్ వారం క్రిత‌మే మ‌జిల్స్‌ కి గాయ‌మైంది. రెస్ట్ తీసుకుంటున్నా అని చెప్పిన అమీర్ అన‌వ‌స‌రంగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో కెలికాడు. ఇప్ప‌టికి దంగాళ్ షూటింగ్ అంటూ హ‌డావుడిగా ఇల్లు వ‌దిలి వెళ్లిపోవాల్సొచ్చింది. దాంతో పోలీసులంతా అత‌డి ఇంటిముందు ప‌డిగాపులు ప‌డాల్సొస్తోంది. ర‌క‌ర‌కాల పార్టీలు ఉన్న‌చోట‌, రాజ‌కీయాలు చేసేవాళ్లున్న దేశంలో ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాల‌న్న ఇంగితం లేక‌పోతే ఇలాంటి స‌న్నివేశ‌మే ఎదుర‌వుతుంది. టూ బ్యాడ్ సిట్యుయేష‌న్ ..